
దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.
దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెతనేలు అయిదవవాడు,
అమీ్మయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.
వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరాక్రమశాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.
షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.
ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.
యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.