ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును నూరేసిమందిగాను వెయ్యేసిమందిగాను వ్యూహ పరచి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆకీషు తో కలిసి దండు వెనుకతట్టున వచ్చుచుండిరి .
ఫలిష్తీయుల సర్దారులు -ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు-ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నాయొద్ద నుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా ? ఇతడు నా యొద్ద చేరిన నాటనుండి నేటి వరకు ఇతనియందు తప్పేమియు నాకు కనబడ లేదని ఫిలిష్తీయుల సర్దారుల తో అనెను
అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతనిమీద కోపపడి -ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలము నకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రా కూడదు , యుద్ధమందు అతడు మనకు విరోధి యవు నేమో , దేనిచేత అతడు తన యజమానుని తో సమాధానపడును ? మనవారి తలలను ఛేదించి తీసికొని పోవుటచేతనే గదా తన యజమానునితో సమాధానపడును.