ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను.
మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.
ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
షేతు బ్రదికిన దినములన్నియు తొమి్మదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
కేయినాను ఎనోషుకు , ఎనోషు షేతుకు , షేతు ఆదాముకు , ఆదాము దేవునికి కుమారుడు.
ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఎనోషు దినములన్నియు తొమి్మదివందల అయిదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
కేయినాను ఎనోషుకు , ఎనోషు షేతుకు , షేతు ఆదాముకు , ఆదాము దేవునికి కుమారుడు.