అందుకు రాజు మీరు వెళ్లి మూడు దినములైన తరువాత నాయొద్దకు తిరిగి రండని సెలవియ్యగా జనులు వెళ్లిపోయిరి.
మూడవ దినమందు నాయొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరును మూడవ దినమందు రెహబామునొద్దకు రాగా
రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి, ¸యవనస్థులు చెప్పిన ప్రకారము వారితో మాటలాడి
వారికి కఠినమైన ప్రత్యుత్తరమిచ్చెను; ఎట్లనగా నా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదనని చెప్పెను.