అంతట కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి .
మందసము కిర్యత్యారీములో నుండిన కాలము ఇరువై సంవత్సరము లాయెను . ఇశ్రాయేలీయు లందరు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా
వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండిమీద ఎక్కించి, అబీనాదాబు ఇంటనుండి తీసికొనివచ్చిరి; ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి.