అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.
నీవు నీ తలి దండ్రులను నీ జన్మ భూమిని విడిచి , యింతకుముందు నీవు ఎరు గని జనము నొద్దకు వచ్చితివి .
యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును ; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి ; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను .