సాదోకు కుమారుడైన అహిమయస్సు నేను పరుగెత్తికొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా
యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను.
అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు కూషీతోకూడ నేనును పరుగెత్తికొనిపోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబు నాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచార మేదియు లేదు గదా అని అతనితో అనగా