How went
1 సమూయేలు 4:16

ఆ మనుష్యుడు -యుద్ధము లోనుండి వచ్చినవాడను నేనే , నేడు యుద్ధము లోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీ తో అనగా అతడు-నాయనా , అక్కడ ఏమి జరిగెనని అడిగెను .

జనులు
1 సమూయేలు 31:1-6
1

అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుటనుండి పారిపోయిరి . గిల్బోవ పర్వతమువరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు

2

సౌలును అతని కుమారులను తరుముచు , యోనాతాను , అబీనాదాబు , మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.

3

యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు

4

సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను .

5

సౌలు మరణమాయెనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడ మరణమాయెను .

6

ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులును అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి .

1దినవృత్తాంతములు 10:1-6
1

ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము...చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి.

2

ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును మల్కీషూవను హతముచేసిరి.

3

యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను.

4

అప్పుడు సౌలు ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను.

5

సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసికొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.

6

ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటివారందరును చచ్చిరి.