దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను .
ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను . మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను .
కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువ కాకుండ దావీదు సమస్తమును రక్షించెను .
మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱ లన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను . ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి .
అలసటచేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందల మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా
దావీదు తోకూడ వెళ్లిన వారిలో దుర్మార్గులును , పనికి మాలినవారునైన కొందరు -వీరు మనతోకూడ రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు సొమ్ములో మన మేమియు వీరికియ్యము ; తమ భార్య పిల్లలను వారు తీసికొని పోవచ్చు ననిరి .
అందుకు దావీదు వారితో ఇట్లనెను -నా సహోదరులారా , యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన యీ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చేయ కూడదు .
మీరు చెప్పినది యెవరు ఒప్పుకొందురు ? యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట; అందరు సమముగానే పాలు పంచుకొందురు గదా
కావున నాటనుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరచి నియమించెను .
దావీదు సిక్లగు నకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి-యెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను .
ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను . కాబట్టి నేటి వరకు సిక్లగు యూదా రాజుల వశమున నున్నది .