ఈ ముగ్గురు
ఆదికాండము 5:32

నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.

వీరి
ఆదికాండము 8:17

పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతోకూడ నున్న ప్రతిజంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.

ఆదికాండము 10:2-32
2

యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

3

గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.

4

యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.

5

వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.

6

హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.

7

కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.

8

కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.

9

అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తికలదు.

10

షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.

11

ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును

12

నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.

13

మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను

14

పత్రుసీయులను కస్లూహీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చినవారు.

15

కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను

16

హివ్వీయులను అర్కీయులను సినీయులను

17

అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను.

18

తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.

19

కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది.

20

వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.

21

మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.

22

షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.

23

అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.

24

అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

25

ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.

26

యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

27

హదోరమును ఊజాలును దిక్లాను

28

ఓబాలును అబీమాయెలును షేబను

29

ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.

30

మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.

31

వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.

32

వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.

1దినవృత్తాంతములు 1:4-28
4

నోవహు షేము హాము యాపెతు.

5

యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

6

గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.

7

యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదానీము.

8

హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.

9

కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబ దదాను.

10

కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరాక్రమశాలులలో మొదటివాడు.

11

లూదీయులు అనామీయులు లెహాబీయులు నప్తుహీయులు

12

పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.

13

కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.

14

యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు

15

హివ్వీయులు అర్కీయులు సీనీయులు

16

అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.

17

షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.

18

అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

19

ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.

20

యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

21

హదోరమును ఊజాలును దిక్లానును

22

ఏబాలును అబీమాయేలును షేబను

23

ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.

24

షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ

25

సెరూగు నాహోరు తెరహు

26

అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.

27

అబ్రాహాము కుమారులు,

28

ఇస్సాకు ఇష్మాయేలు.