కనిష్ఠుడు
1 సమూయేలు 16:11

నీ కుమారు లందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు-ఇంకను కడసారి వాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు -నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా

ఆదికాండము 25:23

–రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమైయుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.