a worthy portion
ఆదికాండము 43:34

మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.

ఆదికాండము 45:22

అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యామీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,

తనకు ప్రియముగా
ఆదికాండము 29:30

యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.

ఆదికాండము 29:31

లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.

ద్వితీయోపదేశకాండమ 21:15

ప్రేమింపబడునదొకతెయు ద్వేషింపబడునదొకతెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కని

లేకుండచేసెను
ఆదికాండము 20:18

ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారానుబట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.

ఆదికాండము 30:2

యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు – నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.