ఇంద్రజాలకునినైనను
1 సమూయేలు 28:11-14
11

ఆ స్త్రీ–నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు–సమూయేలును రప్పింపవలెననెను.

12

ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి–నీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా

13

రాజు–నీవు భయపడ వద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమె–దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను.

14

అందుకతడు–ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది–దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.