ప్రకటించునట్లుగా
రోమీయులకు 15:24-28
24

నేను స్పెయిను దేశమునకు వెళ్లు నప్పుడు మార్గములో మిమ్మును చూచి,మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.

25

అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేము నకు వెళ్లుచున్నాను.

26

ఏలయనగా యెరూషలేము లో ఉన్న పరిశుద్ధు లలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.

27

అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు.

28

ఈ పనిని ముగించి యీ ఫలమును వారి కప్పగించి, నేను, మీ పట్టణముమీదుగా స్పెయిను నకు ప్రయాణము చేతును.