మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవానీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.
కీర్తనల గ్రంథము 106:43-45
43
అనేక పర్యాయములు
ఆయన వారిని విడిపించెను అయినను వారు
తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత
హీనదశనొందిరి.
44
అయినను వారిరోదనము
తనకు వినబడగా
వారికి కలిగిన శ్రమను
ఆయన చూచెను.
45
వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను
జ్ఞాపకముచేసికొనెను
తన కృపాబాహుళ్యమునుబట్టి
వారిని కరుణించెను.
కీర్తనల గ్రంథము 145:8
యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.