తాము కనిన కలయిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము.
దానియేలు 2:23

మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించియున్నావు; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను; ఏలయనగా రాజుయొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరల చెప్పెను.

దానియేలు 2:24

ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు నొద్దకు వెళ్లి బబులోనులోని జ్ఞానులను నశింపజేయ వద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసెద ననెను.