నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదనినిన్నుగూర్చి తమాలవృక్షములు లెబానోను దేవదారువృక్షములు హర్షించును
యెషయా 55:12

మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.

యెషయా 55:13

ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయ బడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.

యెహెజ్కేలు 31:16

అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసితిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠవృక్షములన్నియు ఏదెను వృక్షము లన్నియు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి.

జెకర్యా 11:2

దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను; సరళవృక్షములారా, అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను; సింధూరవృక్షములారా, అంగలార్చుడి.