18:1,2, 18:3-5, 18:6-8, 18:9,10, 18:11,12, 18:13-15, 18:16-19, 18:20,21, 18:22, 18:23-25, 18:26-32, 18:33
ఆదికాండము 18:1,2 మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి-
ఈ వచనాలలో యెహోవా దేవుడు; ఇద్దరు వ్యక్తులతో కలసి అబ్రాహామును దర్శించినట్టు మనం చూస్తాం. యెహోవా దేవుని ప్రత్యక్షతలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ ఆయన మానవరూపంలో అబ్రాహాము దగ్గరకు వచ్చాడు. అయితే తండ్రియైన యెహోవాను ఎవరూ చూడలేదని నూతననిబంధన లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. మరి ఇదెలా సాధ్యం? ఇంతకూ ఈ యెహోవా ఎవరు అనేది అధ్యాయపు ముగింపులో తెలియచేస్తాను.
ఆదికాండము 18:3-5 ప్రభువా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరచు కొనుడి. తరువాత మీరు వెళ్లవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా-
ఈ వచనాలలో అబ్రాహాము తనకు కనబడిన ముగ్గురికీ ఆతిథ్యం చెయ్యడానికి ప్రయత్నించడం మనం చూస్తాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. అబ్రహాము దగ్గరకు వచ్చింది ముగ్గురు అయినప్పటికీ అతను ఒకరిని మాత్రమే "ప్రభువా" అని సంబోధిస్తున్నాడు. ఆ ఒక్కరే యెహోవా దేవుడని మనకు ప్రారంభవచనం తెలియచేస్తుంది. "యెహోవా అతనికి కనబడెను". మిగిలిన ఇద్దరూ దేవదూతలు (22వ&19:1. కొందరు ఈ ముగ్గురినీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడని అపార్థం చేసుకుంటున్నారు. ఆ కారణంగా ముందే ఈ స్పష్టతను ఇస్తున్నాను. సందర్భంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తాను కూడా.
ఆదికాండము 18:6-8 అబ్రాహాము గుడారములో నున్న శారాయొద్దకు త్వరగా వెళ్లినీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్ప గించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయు చుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.
ఈ వచనాలలో అబ్రాహాము యెహోవాకూ దేవదూతలకూ ఆతిధ్యం చెయ్యడం మనం చూస్తాం. ఈ సంఘటనపై కొందరు, దేవుడు/దేవదూతలు ఆహరం తిని దానిని అరిగించుకోవడానికి వారికి జీర్ణాశయం ఉండదు కాబట్టి, వారు అబ్రాహాముకు ఆ ఆహారాన్ని తింటున్నట్టుగా కనిపించారే తప్ప నిజానికి తినలేదని అభిప్రాయపడుతుంటారు. లేఖనాలు స్పష్టంగా చెబుతున్న విషయానికి ఇలాంటి సహజమైన తర్కాలు ఉపయోగించి, మరేదో చెప్పాలని ప్రయత్నించడం సరైనపద్ధతి కాదు. ఇక్కడ దేవుడు/దేవదూతలు మానవరూపాన్ని ధరించుకుని అబ్రాహాము ఇంటికివచ్చినప్పుడు వారు మానవులవలే ఆహారాన్ని భుజించినప్పటికీ అందులో మనకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదు.
ఆదికాండము 18:9,10 వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను. అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చ యముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.
ఈ వచనాలలో యెహోవా అబ్రాహాముతో మరలా ఇదే సమయానికి నీదగ్గరకు వస్తానని అప్పటికి నీకు కుమారుడు జన్మిస్తాడని వాగ్దానం చెయ్యడం మనం చూస్తాం. ఈవిధంగా ఎవరు మాట్లాడతారో (దేవుడు) తనయొద్దకు వచ్చింది ఎవరో అబ్రాహాముకు కచ్చితంగా తెలుసు. అందుకే మొదటే ఆయనను ప్రభువా అని సంబోధించాడు.
"అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను" ఈ మాటలు గమనించండి; వాస్తవానికి ఇస్సాకు జన్మించాక ఆయన మరలా వచ్చినట్టు మనం చదవము. కాబట్టి ఆ మాటలు ఆయన వాగ్దాన నెరవేర్పును సూచిస్తున్నాయి. అందుకే ఆ వాగ్దాన నెరవేర్పు సమయంలో "యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను" (ఆదికాండము 21:1) అని రాయబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే మరో సంవత్సరంలో నీకు నేను వాగ్దానం చేసిన కుమారుడు జన్మిస్తాడని ఆ మాటల భావం. "అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగును" అని ఆ భావం అక్కడే స్పష్టంగా ఉంది.
ఆదికాండము 18:11,12 అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక శారానేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.
ఈ వచనాలలో శారా తమ శారీరక పరిస్థితిని తలచుకుని నవ్వుకున్నట్టు మనం చూస్తాం. మనమున్న పరిస్థితులు దేవుని వాగ్దానాన్ని కూడా నమ్మకుండా చేస్తాయనడానికి ఇదో మంచి ఉదాహరణ. అందుకే మనం మనపై కాకుండా వాగ్దానం చేసిన దేవునిపై, ఆయన సర్వశక్తిపై విశ్వాసముంచాలి. అందుకోసం ఆయన లేఖనాలను ధ్యానించాలి. ఉదాహరణకు ఇక్కడ నవ్విన ఇదే శారా తర్వాత ఆయన పలికిన మాటలను విశ్వసించి ఇస్సాకును కనే శక్తిని పొందుకున్నట్టు చదువుతాం (హెబ్రీ 11:11).
ఆదికాండము 18:13-15 అంతట యెహోవా అబ్రాహాముతోవృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల? యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడినేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను.
ఈ వచనాలలో యెహోవా శారా నవ్వును ప్రశ్నించడం ఆమె భయంతో అబద్ధం చెప్పడం మనం చూస్తాం. అందుకు ఆయన మొదట "యెహోవాకు అసాధ్యమైనది ఏదైననున్నదా?" అంటూ ఆమె నవ్వడానికి గల కారణాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. అనగా ఆమెను బలపరుస్తున్నాడు. అలానే "నీవు నవ్వితివంటూ" ఆమె చెబుతున్న అబద్ధాన్ని కూడా బహిర్గతం చేస్తున్నాడు. ఇక్కడ ఆయనను బలపరిచే దేవునిగానూ పాపాన్ని (అబద్ధాన్ని) సహించకుండా బహిర్గతం చేసే దేవునిగానూ చూస్తున్నాం.
ఆదికాండము 18:16-19 అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను. అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.
ఈ వచనాలలో దేవుడు తన కార్యాన్ని అబ్రాహాముకు తెలియచెయ్యాలనుకోవడం మనం చూస్తాం. దానికి రెండు కారణాలు ఉన్నాయి.
1. అబ్రాహాము నీతిన్యాయాలను జరిగిస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటూ తన ఇంటివారు కూడా అలానే ప్రవర్తించేలా బోధిస్తున్నాడు. అందుకే ఆయన అతనితో మరింత సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాడు.
2. ప్రస్తుతం ఆయన సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను నాశనం చెయ్యబోతున్నాడు. అబ్రాహాముతో చెప్పకుండానే అలా చేసేస్తే భవిష్యత్తులో ఆయన విస్తరింపచేస్తానన్న తన సంతానాన్ని కూడా అలాగే నాశనం చేస్తాడేమో అనే ఆందోళన అతనిలో కలుగుతుంది. పైగా ఆ పట్టణంలో లోతు కూడా కాపురం ఉంటున్నాడు. అందుకే దేవుడు ఆ కార్యం గురించి అబ్రాహాముకు తెలియచేసి, ఆ పట్టణాలను ఊరికే నాశనం చెయ్యడం లేదని, వారు చేసినపాపాన్ని బట్టే న్యాయంగా శిక్షిస్తున్నానని అతనికి అర్థమయ్యేలా వివరించబోతున్నాడు. దీనివల్ల అతను భవిష్యత్తులో ఆయన తన సంతానాన్ని నాశనం చేసినప్పటికీ దానికి న్యాయమైన కారణం ఉంటుందని భావించి ధైర్యం తెచ్చుకుంటాడు.
ఆదికాండము 18:20,21 మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయనియెడల నేను తెలిసికొందుననెను.
ఈ వచనాలలో దేవుడు సొదొమ గొమొఱ్ఱా పట్టణాల పాపాన్ని బట్టి ఆ ప్రజలను విమర్శించడానికి వచ్చానని పలకడం మనం చూస్తాం. ఈ మాటలు మనకు రెండు విషయాలు తెలియచేస్తున్నాయి.
1. ఆయన ఏ జాతి పాపమూ సంపూర్ణం కాకుండా దానిని పూర్తి నాశనం చెయ్యడు.
2. ఆయనకు సొదొమ గొమొఱ్ఱాల పాపం సంపూర్ణమైందని ముందే తెలుసు. అందుకే వాటిని నాశనం చెయ్యడానికి వచ్చాడు. కానీ పైన చెప్పినట్టుగా "నేనేం చేసినా వారిపాపం సంపూర్ణమయ్యాకనే చేస్తానని" అబ్రాహాముకు అర్థమయ్యేలా చెప్పడానికే "వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయనియెడల నేను తెలిసికొందును" అని పలుకుతున్నాడు. అంతేతప్ప ఆ పట్టణాల గురించి ఆయనకు తెలియనిదేదో ఇప్పుడు క్రొత్తగా తెలుసుకుంటాడని కాదు. ఉదాహరణకు; క్రింది వచనాల్లో అబ్రాహాము ఆ పట్టణాల్లో యాభైమంది నీతిమంతులుంటే నాశనం చెయ్యకుంటావా అని మొదలు పెట్టి చివరికి పదిమంది వరకూ వచ్చినప్పుడు కూడా ఆయన అంగీకరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ పట్టణాల్లో పదిమంది నీతిమంతులు కూడా లేరని ముందే ఆయనకు తెలుసు. క్రొత్తగా తెలుసుకోవలసింది ఏమీ లేదు. కానీ అది అబ్రాహాముకు తెలీదు కాబట్టి అతనికి అర్థమయ్యేలా అలా మాట్లాడాడు. దేవుని గురించి ఇలాంటి బాషాశైలి లేఖనాలలో సహజంగా కనిపిస్తుంది. ఉదాహరణకు; యెహోవా చూసెను, ఆయన జ్ఞాపకము చేసుకొనెను, అనుకొనెను, ఇలాంటి పదప్రయోగాలు. దీనికికారణం: ఆయన మనుషులతో మాట్లాడుతున్నాడు కాబట్టి వారికి అర్థమయ్యే రీతిలోనే మాట్లాడాడు.
ఆదికాండము 18:22 ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను.
ఈ వచనంలో యెహోవాతో కలసి అబ్రాహాము దగ్గరకు వచ్చిన ఇద్దరు మనుష్యులు సొదొమ వైపుగా వెళ్ళినట్టు మనం చూస్తాం. వారు దేవదూతలని తర్వాత అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది (ఆదికాండము 19:1). దేవుడు వారిని సొదొమవైపు పంపివేసాడు కానీ ఆయన మాత్రం అబ్రాహాము ఇంటి పరిసర ప్రాంతాల్లోనే నిలిచియున్నాడు. ఎందుకంటే ఆయన అబ్రాహాము మనసులో ఉన్న సందేహాలను తీర్చడానికి అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు.
ఆదికాండము 18:23-25 అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెను దుష్టులతో కూడ నీతి మంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండిన యెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు-
ఈ వచనాలలో అబ్రాహాము సొదొమ గొమొఱ్ఱా పట్టణాల విషయంలో దేవునితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. అతను ఈవిధంగా మాట్లాడడానికి రెండు కారణాలు ఉన్నాయి.
1. ఆయన దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నశింపచెయ్యడం ఆయన న్యాయానికి విరుద్ధం. అబ్రాహాము తన మనసులో అక్కడ కనీసం యాబైమందైనా నీతిమంతులు ఉంటారని భావిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వారిని కూడా నాశనం చేస్తే ఆయనపై ఆ నిందపడుతుందని ఆలోచించి ఈవిధంగా మాట్లాడుతున్నాడు. అబ్రాహాము దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాడు అనడానికి మంచి ఆధారమే ఈమాటలు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఆయన గుణలక్షణాలకు చెడ్డపేరు వస్తుందంటే దానిని సహించలేడు. ఉదాహరణకు; ఆయన ఇశ్రాయేలీయులను నాశనం చేస్తాను అన్నప్పుడు కూడా మోషే ఇలాంటి ఆవేదననే ఆయనముందు వ్యక్తపరిచాడు (నిర్గమకాండము 32:7-14 ).
2. అబ్రాహాము మనసులో ఈమాటలు పలకడం వెనుక నీతిమంతుడైన లోతును గురించిన ఆలోచన కూడా ఉంది. అందుకే ఆదికాండము 19:29వ వచనంలో "దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించినట్టు" రాయబడింది. కాబట్టి ఈ సందర్భంలో అబ్రాహాము లోతు పేరు తియ్యకుండా దేవునితో మాట్లాడనప్పటికీ అతనిని గురించిన చింత మాత్రం మనసులో ఉంది.
చూడండి; గతంలో పశువుల కాపరుల మధ్య తలెత్తిన కలహాల వల్ల ఆ లోతు అబ్రాహాముకు దూరంగా నివసిస్తున్నాడు. అయినప్పటికీ అబ్రాహాము అతనికోసం ఆలోచించి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కాబట్టి మనవారు మనకు ఎంత దూరంగా ఉంటున్నప్పటికీ వారు అలా ఉండడానికి వ్యక్తిగత కలహాలు కూడా కారణమైనప్పటికీ వారి క్షేమంకోసం ప్రార్థించకుండా ఉండకూడదు.
ఆదికాండము 18:26-32 యెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను. అతడింక ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబదిమందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని యెడల నేను మాటలాడెదను. ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను. అందు కతడుఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని. ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడనియెడల నేనింకొకమారే మాటలాడెదను. ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయకయుందుననెను.
ఈ వచనాలలో అబ్రాహాము తాను మొదట ప్రస్తావించిన లెక్కనుండి పదిమంది వరకూ వెళ్ళడం అక్కడ ఆ పదిమంది కూడా లేరని అర్థమై మౌనంగా ఉండడం మనం చూస్తాం. దీనివల్ల అబ్రాహాము మనసులో రెండు ఆందోళనలూ సద్దుమణిగాయి.
1. ఆ పట్టణంలో పదిమంది నీతిమంతులు కూడా లేరు కాబట్టి దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేసాడనే నింద ఆయనపై పడదు.
2. ఆయన పాపం పరిపూర్ణపయ్యాకనే ఏ జాతినైనా నాశనం చేస్తాడు కాబట్టి అబ్రాహాము సంతానం నాశనం చెయ్యబడినప్పటికీ దానికి వారి పాపమే కారణం.
ఈ విషయం అతనికి అర్థమవ్వాలనే దేవుడు ఇప్పటివరకూ అంత దీర్ఘశాంతం వహించాడు.
అయితే లోతును గురించిన చింతమాత్రం తన మనసులో అలానే ఉండిపోయింది. ఎందుకంటే అతనికి పదిమంది నీతిమంతులు కూడా ఆ పట్టణంలో లేరని తెలిసినప్పుడు ఇంకా ఆయనతో మాట్లాడే సాహసం చెయ్యలేకపోయాడు. బహుశా అతను ఆ పట్టణంలో లోతు ఇంటివారి (పనివారితో సహా) తో కలిపి కనీసం పదిమంది నీతిమంతులైనా ఉంటారని విశ్వసించి అంతవరకూ మాట్లాడియుండవచ్చు. కానీ అక్కడ లోతు తప్ప అతని కుటుంబంలో కూడా ఎవరూ నీతిమంతులుగా లేరు. అయినప్పటికీ దేవుడు ఆ ఒకడ్ని కూడా విడిచిపెట్టకుండా అతనితో పాటు అతని కుటుంబాన్ని కూడా కాపాడినట్టు మనం చదువుతాం.
ఆదికాండము 18:33 యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.
ఈ వచనంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత అతని యొద్దనుండి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. తర్వాత అధ్యాయంలో ఇదే యెహోవా సొదొమ గొమొఱ్ణా పట్టణాలవద్దకు వెళ్ళి, తాను చెప్పినట్టుగానే ఆ పట్టణాలను నాశనం చేసాడు (ఆదికాండము 19:24).
గమనించండి; ఈ యెహోవా తండ్రియైన యెహోవా కాదు. ఎందుకంటే తండ్రియైన యెహోవాను ఎవరూ చూడలేదని స్పష్టంగా రాయబడింది (యోహాను 1:18). కాబట్టి ఇప్పటివరకూ మనం చూసిన ఈ యెహోవా కుమారుడైన యెహోవా. పాతనిబంధనలో ఆయన కూడా యెహోవా అనే నామంతోనే భక్తులకు ప్రత్యక్షమయ్యాడు. దీనిగురించి సంపూర్ణ లేఖన ఆధారాలతో వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
యెహోవా దూత యేసుక్రీస్తు
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 18

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"