ఆడియో
నా కుమారుడా/కుమార్తె,
-
నీకు నా గురించి తెలియకపోవచ్చు గానీ, నీ గురించి సమస్తమూ నాకు తెలుసు.(కీర్తన. 139:1)
-
నువ్వు కూర్చోవడం, నువ్వు లేవడం నాకు తెలుసు. (కీర్తన 139:2)
-
నీ నడవడి నాకు బాగా తెలుసు. (కీర్తన 139:3)
-
నీ తలవెంట్రుకలన్నీ నేను లెక్కించాను. (మత్తయి 10:29-31)
-
ఎందుకంటే, నేను నిన్ను నా స్వరూపంలో సృజించాను. (ఆదికాండం 1:27)
-
నువ్వు నా యందు బ్రతుకుతున్నావు, చలిస్తున్నావు, ఉనికి కలిగున్నావు. (అపో.కార్యాలు 17:28a)
-
(ఎందుకంటే) నువ్వు నా సంతానానివి. (అపో.కార్యాలు 17:28b)
-
గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నువ్వు నాకు తెలుసు. (యిర్మియా 1:4,5)
-
సృష్టిని సృజించాలని నిర్ణయించినపడే నేను నిన్ను ఏర్పర్చుకున్నాను. (ఎఫెసీయులు 1:11,12)
-
నువ్వు జన్మించటం యాదృచ్ఛికం కాదు, నీ రోజులన్నీ నా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. (కీర్తన 139:15,16)
-
నువ్వు జన్మించిన ఖచ్ఛితమైన సమయాన్ని, నువ్వు జీవిస్తున్న నిర్దిష్టమైన ప్రదేశాన్ని నేనే నిర్ణయించాను. (అపో.కార్యాలు 17:26,27)
-
చూస్తే భయాన్నీ, ఆశ్చర్యాన్నీ పుట్టించే విధంగా నేను నిన్ను కలుగజేసాను. (కీర్తన 139:14)
-
నీ తల్లి గర్భంలో నేనే నిన్ను నిర్మించాను. (కీర్తన 139 :13)
-
తల్లి గర్భం నుండి నేనే నిన్ను ఉద్భవింపజేసాను. (కీర్తన 71:6)
-
నేనంటే తెలియనివారి ద్వారా నేను నీకు తప్పుగా తెలియజేయబడ్డాను. (యోహాను 8:41- 44)
-
నేను దూరస్థుడ్ని కాను, కోపపడువానిని అంతకన్నా కాను; నేను ప్రేమాస్వరూపిని. (1యోహాను 4:16)
-
నా ప్రేమను నీమీద కుమ్మరించాలని నా కోరిక. (1యోహాను 3:1a)
-
అందుకు ఒకటే కారణం, నువ్వు నా బిడ్డవి, నేను నీ తండ్రిని. (1యోహాను 3:1)
-
నీ భూలోకపు తండ్రి నీకివ్వగలిగే యీవులన్నిటికన్నా నేను సమృద్ధిగా ఇచ్చేవాడిని. (మత్తయి 7:11)
-
ఎందుకంటే నేను పరిపూర్ణుడైన తండ్రిని. (మత్తయి 5:48)
-
శ్రేష్ఠమైన ప్రతి యీవి, సంపూర్ణమైన ప్రతి వరము నా నుండే వస్తుంది. (యాకోబు 1:17)
-
ఎందుకంటే, నేను నీ పోషకుడిని; నీ అవసరాలన్నీ తీర్చేవాడిని నేనే. (మత్తయి 6:31-33)
-
నీ గురించి నేనుద్దేశించిన సంగతులన్నీ నీ భవిష్యత్తు పట్ల నిరీక్షణ కలుగజేసేవే. (యిర్మియా 29:11)
-
ఎందుకంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. (యిర్మియా 31:3)
-
నీ పట్ల నాకున్న ఉద్దేశ్యాలు, ఆలోచనలు సముద్రతీరంలోని యిసుకరేణువులకన్నా లెక్కకు ఎక్కువై ఉన్నాయి. (కీర్తన 139:17,18)
-
నీ పట్ల ప్రేమ, సంతోషం చేత నేను హర్షిస్తున్నాను. (జెఫన్యా 3:17)
-
నీకు మేలు చేయటం నేను మానను. (యిర్మియా 32:40)
-
నువ్వు నా అమూల్యమైన స్వాస్థ్యానివి. (నిర్గమకాండం 19:5)
-
నిన్ను నిశ్చయంగా స్థాపించాలని నా పూర్ణహృదయంతో కోరుతున్నాను. (యిర్మియా 32:41)
-
నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేయాలని నా తాపత్రయం. (యిర్మియా 33:3)
-
నీవు నన్ను నీ పూర్ణహృదయంతోను నీ పూర్ణాత్మతోను వెదకితే, నేను నీకు దొరుకుతాను. (ద్వితియోపదేశకాండం 4:29)
-
నన్ను బట్టి సంతోషిస్తే నీ హృదయవాంఛలను తీరుస్తాను. (కీర్తన 37:4)
-
అసలు ఆ వాంఛలను నీలో పుట్టించింది నేనే. (ఫిలిప్పీ 2:13)
-
నువ్వు ఊహించువాటన్నిటికంటే నీకు నేను అత్యధికంగా చేయగలను. (ఎఫెసీయులు 3:20)
-
ఎందుకంటే, నిన్ను ప్రోత్సాహపరిచేవారిలో నేనే ముందుంటాను, నిన్ను ధైర్యపరిచేవారిలో నేనే మొదటివాడిని. (2 థెస్సలొనికయులు 2:16,17)
-
అంతే కాదు, నీకున్న అన్ని సమస్యలలో ఆదరించే తండ్రిని నేనే. (2 కొరింథియులు 1:3,4)
-
నీ హృదయం విరిగిన సమయంలో నేను నీ చెంతనే ఉన్నాను. (కీర్తన 34:18)
-
గొఱ్ఱెలకాపరి ఏ విధంగానైతే గొఱ్ఱెపిల్లను తన రొమ్ముకు ఆన్చుకుని మోస్తాడో, ఆవిధంగా నా హృదయానికి దగ్గరగా నిన్ను మోసాను. (యెషయా 40 :11)
-
ఒక రోజు వస్తుంది, అప్పడు నీ కళ్ళు కార్చిన ప్రతి కన్నీటిబొట్టును తుడిచివేస్తాను. భూమ్మీద నువ్వు అనుభవించిన ప్రతి బాధను తీసివేస్తాను. (ప్రకటన 21:3,4)
-
నేను నీ తండ్రిని; నా కుమారుడైన యేసును ప్రేమించిన విధంగా నిన్నూనేను ప్రేమిస్తున్నాను. (యోహాను 17:23)
-
యేసులో, నీ పట్ల నాకున్న ప్రేమను వెల్లడి చేశాను. ( యోహాను 17:26)
-
యేసులో నా యొక్క తత్వమంతా మూర్తిమంతమై ఉంది. (హెబ్రియులు 1:3)
-
నీ తండ్రినైన నేను నీ పక్షమునే కానీ, నీకు విరోధము కాదని నిరూపించడానికీ. (రోమీయులు 8:31)
-
నీ అపరాధాల్ని నీ మీదనేను మోపనని చెప్పటానికీ, యేసు వచ్చియున్నాడు; (2 కొరింథియులు 5:18,19)
-
నేనూ, నువ్వూ సమాధానపడాలని యేసు చనిపోయాడు. (2 కొరింథియులు 5:18,19)
-
నీ పట్ల నాకున్న ప్రేమనుయేసు మృతి ద్వారా నేను అత్యున్నతంగా వ్యక్తం చేసాను. (1యోహాను 4:10)
-
నీ ప్రేమను పొందుకోవడానికి, నాకున్న సమస్తాన్నీ, నేను ప్రేమించిన ప్రతి(వా)దానినీ త్యాగం చేసాను. (రోమీయులు 8 :31,32)
-
నువ్వు నా కుమారుడైన యేసు అన్న బహుమానాన్ని స్వీకరిస్తే, నన్ను స్వీకరించినట్టే. (1యోహాను 2:23)
-
అపుడు ఏదీ నా ప్రేమ నుండి నిన్ను మరలా వేరుచేయదు, చేయలేదు. (రోమీయులు 8:38,39)
-
నువ్వు మన ఇంటికి తిరిగివస్తే, పరలోకము ఎన్నడూ చూసి ఎరుగనటువంటి అత్యంత గొప్ప విందు చేయిస్తాను. (లూకా 15:7)
-
నేను నీకు ఎల్లప్పుడూ తండ్రినై ఉన్నాను, ఎల్లప్పుడూ నీకు తండ్రిగా ఉంటాను. (ఎఫెసీయులు 3:14,15)
-
కానీ, నా కుమారునిగా ఉండటం నీకిష్టమేనా అన్నదే నా ప్రశ్న. (యోహాను 1: 12,13)
-
నేను నీ కొరకు ఎదురుచూస్తున్నాను. [లూకా 15:11-32 తప్పిపోయిన కుమారుని ఉపమానం]
ప్రేమతో,
మీ నాన్న,
సర్వశక్తుడైన దేవుడు.
Father's Love Letter used by permission Father Heart Communications ©1999 FathersLoveLetter.com
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2021 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments