దుర్బోధలకు జవాబు
రచయిత: యం. రవీందర్

Institute of Bible Technology (I.B.T) వ్యవస్థాపకులైన డా|| బొంకూరి జాన్ గారు గతంలో వ్రాసిన 'యేసు ఎవరు?' అనే కరపత్రమును విమర్శిస్తూ www.hithabodha.com లో మేము ఒక వ్యాసమును ప్రచురించాము.

అది డా|| జాన్ గారికి, మరికొందరు సహోదరులకు తెలియజేశాము. వారు దానిని చదివి సమాధానముగా పూజారుడైవరు' అను ప్రసంగమును సి.డి రూపంలో మాకు పంపారు. కానీ ఇందులో మేము లేవనెత్తిన 10 ప్రశ్నలలో 3,4 వాటికి మాత్రమే సమాధానములు ఇవ్వ ప్రయత్నించారు. అయితే అందులో ఏ ఒక్కటి కూడా లేఖనబద్ధమైన సమాధానాలు కాకపోగా దాని వల్ల లేఖనాల బోధను మరింత అస్థవ్యస్తము చేయడం జరిగింది. సదరు ప్రసంగములో జాన్ గారు ప్రస్తావించిన కొన్ని ముఖ్య అంశాలను ఈ క్రింద ఉదాహరిస్తూ ప్రతి అంశం క్రింద మా సద్విమర్శను అందిస్తున్నాము. పాఠకులు వీటి గురించి ప్రార్థనపూర్వకంగా పరిఆలోచిస్తారని, బెరియ సంఘస్తుల వలె వీటిని లేఖనకాంతిలో పరిశీలిస్తారని ఆశిస్తున్నాము. ఇక ఆ వివరాలలోకి వెళదాము.

1. బొంకూరి జాన్ :

'యేసు ఎవరు?” అను కరపత్రములను 5000 పంచితే ఒకే ఒక్క పాస్టర్ మాత్రమే ఫోన్ చేసి మాట్లాడారు.

మా సద్విమర్శ :

జాన్గారు సి.డి ఆరంభంలో పై మాటలు చెప్పారు. ఇది అబద్ధం ఎందుకంటే గత రెండు సంవత్సరములుగా ఈ విషయం మాట్లాడాలి అని మేము జాన్ గారిని అడుగుతూ ఉంటే 6 నెలల క్రిందట మొట్టమొదటి సారిగా మాట్లాడడానికి మాకు అవకాశం ఇచ్చారు.

2. బొంకూరి జాన్:

* యేసుకు, మరియమ్మకు ఉన్న అన్ని గుణాలు ఉన్నాయి. మనలాంటి పాప శరీరాకారముతో ఆయన వచ్చాడు. మరణించి, జయించి, తిరిగి లేచి ఇప్పుడు దేవుని కుడిపార్శ్యములో దేవుడై కూర్చున్నాడు. అంతేతప్ప ఆయన భూమిమీద ఉన్నప్పుడు మూములు మానవుడే, కుమారుడే అని బైబిలు అంతా చెబుతుంది. అందుకే యేసుక్రీస్తుగా పిలువబడుతున్న ఆయనను మనము మొక్కకూడదు, పూజింపకూడదు, ఆరాధించకూడదు.”

ఆ తరువాత కొద్దిసేపటికి లూకా 4:3,4 వచనాలను వివరిస్తూ “యేసు సాతానుతో పిచ్చివాడా నీకో సంగతి చెబుతాను మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదు దేవుని నుండి వచ్చు ప్రతిమాట వలన జీవించును. “జీవింపజేసే ఆ మాటను నేనే” నేనే మార్గము, సత్యము, జీవం...... నేను రొట్టె తిననంత మాత్రాన నాకోచ్చే నష్టమేమిలేదు. అదిమనుష్యులందరికి పనికి వచ్చేమాట నాకు కాదు. ఎందుకంటే “నేనే ఆ మాటను” అని చెప్పాడు.”

మా సద్విమర్శ :

ఇంతకీ మా ప్రశ్న ఏమిటంటే యేసు క్రీస్తు మనుష్యుడా?, దేవుడా?

పై రెండు పేరాలలో underline చేసిన మాటలు గమనించండి. యేసుక్రీస్తు మానవుడు, దేవుడు అని జాన్ గారు తెలియకనే చెప్పారు. గమనించవలసిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు స్తోత్రారుడు, పూజారుడు అని చెప్పడంలో మా ఉద్దేశ్యము ఆయన మనుష్యుడుగా రాకముందు ఏమైయున్నాడు? మనుష్యుడుగా ఎలా ఉన్నాడు? పునరుత్థానుడైన తరువాత ఎలా ఉన్నాడు. ఈ విషయాలన్నిటినీ ఆలోచించినపుడే ఆయన అదృశ్యదేవుని యొక్క నిజస్వరూపం అని మనమెరుగగలము.

3. బొంకూరి జాన్ :

లూకా 4:8 చూపిస్తూ ఈ సాక్షివాడు చూసావా ఇక్కడ యేసు ప్రభువువే సాతాను గాన్ని తనకు మొక్కమని అన్నాడు”.

మా సద్విమర్శ :

* సైతాను గాన్ని యేసు ప్రభువు నాకు మొక్కు అన్నాడు” అని మేము మా కరపత్రములో వ్రాసాము అని బొంకూరి జాన్ గారు చెప్పారు. యేసు క్రీస్తును ఆరాధించాలనే మా వాదనకు మేము అనని ఈ మాటనే ఆధారంగా తీసుకున్నామని శ్రోతలకు తప్పు చిత్రణ ఇచ్చారు. మేము మా కరపత్రములో ఎక్కడా ఈ మాట వ్రాయలేదు. కావాలంటే www.truth.co.in లో యేసు క్రీస్తు దైవత్వం అనే వ్యాసమును చదివి చూడండి. జాన్ గారు మేము అనని మాటను తీసుకొని వ్యర్థ ప్రసంగం చేశారు.

4. బొంకూరి జాన్ :

“తోమా మొక్కాడు గదా అందుకని మనము మొక్కవచ్చు అని అంటాడు. ఈ కరపత్రం వ్రాసిన వాడు. అందుకే తోమా కనబడలేదురాబై పో అన్నాను. తోమా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడక ముందు మొక్కాడు కాబట్టి చెల్లదు”. “తెలియక ఎవడన్నా దండం పెడితే ప్రక్కకు జరిగి ఎందుకరా బాబూ నాకు మొక్కొద్దు అని చెబుతాము. కొందరు దావీదును -మొక్కితే వద్దన్నాడు”.

మా సద్విమర్శ :

జాన్ గారి పై మాటల్లో తోమా తరువాత కనబడలేదు అన్నాడు. అపో.కా. 1:13 లో చూడండి తోమా ఉన్నాడు తోమా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడక ముందు మొక్కాడు. కాబట్టి చెల్లదు అంటారు జాన్ గారు కాని మా ప్రశ్న తోమా మొక్కితే యేసు క్రీస్తు ఎందుకు వద్దనలేదు? అని జాన్ గారు చెప్పిన ఉదాహరణో దావీదు మొక్కబడుటకు నిరాకరించినట్లే యేసుక్రీస్తు కూడా చేసివుండవలసింది కదా?

మరొక విషయం: పరిశుద్ధాత్మ పూర్ణుడైన స్తెఫను యేసు ప్రభువుకే మొర పెట్టాడు.అపో. కా. 7: 55, 59 , ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని అన్నాడుఅపో. కా. 7: 59,60 . సైఫను చేసిన ప్రార్థనలో “యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము” అని మొరపెట్టాడు. ఆత్మను చేర్చుకొనేది ఎవరు?ప్రసంగి 12:7 చదవండి. స్తెఫను మోకాళ్ళూని..... ప్రభువా... అని పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రార్థన చేసాడు. (అపో.కా 7:60 ).

5. బొంకూరి జాన్ :

ప్రకటన 5:9-14 “ఆ పెద్దలు నమస్కారము చేశారు గదా మనమెందుకు చేయకూడదు? అని అంటాడు ఈ కరపత్రం వ్రాసినవాడు”.

మా సద్విమర్శ :

జాన్గారు మేము ఏ పేజీలో ఏ పేరాలో ఈ మాటలు వ్రాసామో చూపించగలరా? మేమన్నది పెద్దలు నమస్కారము చేశారు కాబట్టి మనం చేయాలి అని కాదు. సృష్టి అంతా స్తోత్రములు చెల్లించారు. అయితే మనము కూడా సృష్టిలో భాగమే.

6. బొంకూరి జాన్ :

ప్రకటన 5:9-14 ను వివరిస్తూ “దూతలందరూ యేసుకు నమస్కారం చేయాలి ( హెబ్రి 1:6 ) దూతలు మనకు కూడా మొక్కాలి. అయితే మనము దూతలకు మొక్కకూడదు”.

మా సద్విమర్శ :

జాన్ గారు దూతలు మనకు కూడా మొక్కాలి అన్నారు. దానికి లేఖనాల నుండి ఒక్క ఆధారం చూపించండి.

7. బొంకూరి జాన్ :

ప్రకటన 5:13,14 *....మనము సృస్టము కాదు దేవుడు కన్నవారము. కాబట్టి సృష్టి అంతా, దేవదూతలంతా యేసును ఆరాధించవచ్చు కాని మనం తండ్రిని మాత్రమే ఆరాధించాలి.”

మా సద్విమర్శ :

ఇక్కడ జాన్ గారు సృష్టి అంతా యేసుక్రీస్తును ఆరాధించాలి. అని ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనము సృష్టిలో భాగమా? కాదా? అని ఇక్కడ జాన్గారు మనము సృష్టము కాదు అన్నారు.

విచిత్రమేమిటంటే ఈ జాన్ గారే ''Trinity or unity' అనే మరొక ప్రసంగంలో మనం దేవుని సృష్టి అని చెప్పాడు. యెషయా 54:51 మనము దేవుని సృష్టి అని బైబిల్లో అనేక వచనాలున్నాయి. ఉదా: మార్కు 16:15"...... మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి” మనము ప్రకటించేది మనుష్యులకే గదా? యోబు 33:4 “దేవుని ఆత్మ నన్ను సృజించెను”

హెబ్రీ 4:13 , కొలస్సీ 1:23 , యాకోబు 1:18 ,గలతీ 6:15 2 కొరింథీ 5:17 , కొలస్సి 1 ఈ వచనాలన్నీ మనము కూడా సృష్టమేనని సాక్ష్యమిస్తున్నాయి. కాబట్టి సృష్టమంతయు యేసుక్రీస్తును ఆరాధించాలి అని జాన్గారు చేసిన ఉద్బోదననుసరించి మనము కూడా యేసుక్రీస్తును ఆరాధించాలి.

పైన ఉదాహరించిన వాటికి మించి యేసుక్రీస్తు దైవత్వం అనే మా వ్యాసములోని ఏ అంశమును జాన్ గారు కనీసం తాకను కూడా లేదు. జెర్రీథామస్ అనే మా సహోదరుడు యేసుక్రీస్తు దైవత్వం గురించి ముస్లిములతో వాదిస్తూ, వారి చేతిలో చావుదెబ్బలు తిన్నాడని అవమానపాలైయ్యాడని ఇలా ఎన్నో విధాలుగా వ్యక్తిగతంగా విమర్శిస్తూ తన ప్రసంగసమయాన్ని వ్యర్థం చేశారు. అయితే ఆంగ్ల భాషను సరిగ్గా అర్థం చేసుకునే ఏ క్రైస్తవుడికైనా ఆ డిబేట్ సి.డిని వినిపించండి. జాన్ గారు చెప్పింది పచ్చిఅబద్ధం అని వారు కూడా నిర్ధారిస్తారు.

ఒక్క సి.డి లోనే స్వయం వైరుధ్యాలు, అసంబద్దాలు, అబద్దాలు మాట్లాడిన జాన్ గారిని, వారి బోధను ఎలా నమ్మాలో మీరే పరిశీలించి తెలుసుకోవాలని యేసుక్రీస్తునామములో కోరుచున్నాము. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి గాని వాటిని గురించి సమయము వచ్చినప్పుడు మాట్లాడతాము కాని ఒక విషయము మాత్రము గుర్తెరగండి యేసుక్రీస్తు దేవుడే. ఆయన పూజారుడే. ఈ సత్యాన్ని నిరాకరించవచ్చునేమో కాని ఎవ్వరునూ నిర్మూలము చేయజాలరు; తిరస్కరించవచ్చునేమో కానీ తప్పని నిరూపించుట ఎవ్వరి తరము కాదు.

 

Add comment

Security code
Refresh

Comments  

# EvangelistV. N. Swamy 2019-08-15 16:31
వండర్ఫుల్
Reply
# RE: యేసుక్రీస్తు పూజార్హుడేShyambabu 2020-02-15 22:01
Good explanation about the deity of our Lord Jesus Christ.
Reply
దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.