యోనాతాను హృదయము
1 సమూయేలు 14:1-14
1

ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియు చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలివారిని హతముచేయ పోదము రమ్మనెను .

2

సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద దిగియుండెను , అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు వందల మంది .

3

షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీయొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను .

4

యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పో జూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూది గట్టును ఉండెను, వాటిలో ఒకదాని పేరు బొస్సేసు రెండవదానిపేరు సెనే .

5

ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపువైపునను , రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపువైపునను ఉండెను .

6

యోనాతాను -ఈ సున్నతిలేనివారి దండు కాపరులమీదికి పోదము రమ్ము , యెహోవా మన కార్యమును సాగించునేమో , అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయు వానితో చెప్పగా

7

అతడు-నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము , పోదము రమ్ము. నీ యిష్టాను సారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను .

8

అప్పుడు యోనాతాను -మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము .

9

వారు మనలను చూచి-మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన యెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము .

10

మాయొద్దకు రండని వారు చెప్పిన యెడల యెహోవా వారిని మనచేతికి అప్పగించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా

11

వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి . అప్పుడే ఫిలిష్తీయులు -చూడుడి , తాము దాగియుండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు

12

యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి-మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను -నా వెనుక రమ్ము , యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి

13

అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతుల తోను కాళ్ల తోను ప్రాకి యెక్కిరి . ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను .

14

యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువది మంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అర యెకరము నేల పొడుగున అది జరిగెను.

1 సమూయేలు 14:45-14
ఆదికాండము 44:30

కావున తమ దాసుడైన నా తండ్రియొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మాయొద్ద లేనియెడల

న్యాయాధిపతులు 20:11

కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరివారితో యుద్ధముచేయుటకు కూడిరి.

1దినవృత్తాంతములు 12:17

దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను మీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.

కీర్తనల గ్రంథము 86:11

యెహోవా , నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము . నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.

కొలొస్సయులకు 2:2

నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొన గోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.

అతని ప్రేమించెను
1 సమూయేలు 18:3

దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసికొనెను .

1 సమూయేలు 19:2

సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతొ ఇట్లనెను -నా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీదనున్నాడు . కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము .

1 సమూయేలు 20:17

యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను .

ద్వితీయోపదేశకాండమ 13:6

నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని

2 సమూయేలు 1:26

నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.

సామెతలు 18:24

బహుమంది చెలికాండ్రుగలవాడు నష్టపడును సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.