అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, ఆయన యెదుట ఒప్పుకొని, నీవు చేసినదానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా
అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.
కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా
అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులుగలవాడనైయున్నాను.
తాను యెహోవా సన్నిధిలోనుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసియుండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతని నడిగిరి.