తిరుగువారు
న్యాయాధిపతులు 5:10

తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి.

న్యాయాధిపతులు 12:14

అతనికి నలువదిమంది కుమారులును ముప్పదిమంది మనుమలును ఉండిరి. వారు డెబ్బది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు. అతడు ఎనిమిదేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.

పేరు
సంఖ్యాకాండము 32:41

అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.

ద్వితీయోపదేశకాండమ 3:14

మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయాకాతీయు యొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.