ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.
ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపుమాటలు నిజమని కనబడెను.
మీ మనస్సు సిద్ధమైయున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.
అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని.
మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమి్మక కలిగియున్నందుకు మేము సిగ్గుపరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?