ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.
మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా
యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.
అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.
కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చినవారితో కూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.
అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియైయుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి.
యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.
యోసేపు తన సహోదరులను గురుతు పట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.
యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకముచేసికొని మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా
వారులేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితివిు;
మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.
అయితే అతడు లేదు, ఈ దేశము గుట్టు తెలిసికొనుటకై వచ్చితిరని వారితో అనెను.
అందుకు వారు నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.
అయితే యోసేపు మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.
దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవముతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.
మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడియుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగులవారని చెప్పి
వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.
మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.
మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొనిపోవుడి.
మీ తమ్ముని నా యొద్దకు తీసికొనిరండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.
అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి;అందువలన ఈ వేదన మనకు వచ్చెదనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి .
మరియు రూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారి కుత్తరమిచ్చెను.
అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.
అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.
వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా