పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.
పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.
రయూ సెరూగును కనిన తరువాత రెండువందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.
ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.