ఇశ్రాయేలీయులను వారివారి స్థలములకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను.
సంఖ్యాకాండము 32:29-32
29

గాదీయులును రూబేనీయులును అందరు యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్దపడి మీతో కూడ యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను.

30

అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లనియెడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా

31

గాదీయులును రూబేనీయులును యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము.

32

మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నది దాటి కనానుదేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి.

ద్వితీయోపదేశకాండమ 3:18-20
18

ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకొనునట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరు యుద్ధసన్నధ్దులై మీ సహోదరులగు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను.

19

అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును, విశ్రాంతినిచ్చువరకు,

20

అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారి కిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొనువరకు, మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీకిచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును.

యెహొషువ 4:12

మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నద్ధులై దాటిరి.

యెహొషువ 4:13

సేనలో ఇంచుమించు నలువది వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి.