
తూర్పు దిశను చుట్టును కొల కఱ్ఱతో కొలువగా ఐదు వందల బారలాయెను.
ఉత్తర దిశను చుట్టును కొల కఱ్ఱతో కొలువగా ఐదు వందల బారలును
దక్షిణ దిశను కొల కఱ్ఱతో కొలువగా ఐదు వందల బారలును,
పశ్చిమ దిశను తిరిగి కొల కఱ్ఱతో కొలువగా ఐదు వందల బారలును తేలెను.
నాలుగు తట్లు అతడు కొలిచెను; ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలమునుండి ప్రత్యేకపరుచుటకై దానిచుట్టు నలుదిశల ఐదు వందల బారలుగల చచ్చౌకపు గోడ కట్టబడి యుండెను.