ఆమె పంటెను చేత పట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును
నిర్గమకాండము 35:25

మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి.

నిర్గమకాండము 35:26

ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలను వడికిరి.