కృప
2 సమూయేలు 7:15

నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.

2 సమూయేలు 7:16

నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.

యెషయా 54:10

పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 55:3

చెవి యొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును .

అపొస్తలుల కార్యములు 13:32-34
32

దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము.

33

ఆలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.

34

మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.

నిబంధన
కీర్తనల గ్రంథము 89:34

నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను .

కీర్తనల గ్రంథము 111:5
తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చి యున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును.
కీర్తనల గ్రంథము 111:9
ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించు వాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.
2 సమూయేలు 23:5

నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.

యిర్మీయా 33:20

యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగాదివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల

యిర్మీయా 33:21

నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థ మగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.