నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను
కీర్తనల గ్రంథము 63:4

నా మంచముమీద నిన్ను జ్ఞాపకముచేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు

కీర్తనల గ్రంథము 145:1
రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను
కీర్తనల గ్రంథము 145:2
అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
కీర్తనల గ్రంథము 146:2
నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె దను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను