యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయాదాను కనెను.
యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.
యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులైయుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా
ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహోహానాను