
దావీదు –మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో నున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను.
తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి
తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావు–నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.