ఏలినవాడుమీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను.
ఆదికాండము 42:7-10
7

యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి–మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు–ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.

8

యోసేపు తన సహోదరులను గురుతు పట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.

9

యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని–మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా

10

వారు–లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితివిు;

ఆదికాండము 43:7

వారు–ఆ మనుష్యుడు –మీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితివిు– మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.

ఆదికాండము 43:29

అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి– మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి –నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను