ఎట్లనగా, భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అను కూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.
అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.
నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.