26:1, 26:2, 26:3, 26:4, 26:5, 26:6,7, 26:8-11, 26:12-14, 26:15, 26:16,17, 26:18-22, 26:23-25, 26:26, 26:27-31, 26:32,33, 26:34,35
ఆదికాండము 26:1 అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.
ఈ వచనంలో కనానులో మరలా కరవు సంభవించినట్టు, అప్పుడు ఇస్సాకు ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళినట్టు మనం చూస్తాం. అబ్రాహాము ఇస్సాకులు ఇద్దరూ కనాను దేశంలో కరువును ఎదుర్కొన్నారు, వీరి వారసుడైన యాకోబుకు కూడా అక్కడ అదే పరిస్థితే ఎదురైంది (). గమనించండి; కనాను దేశం వీరి వాగ్దాన భూమి. దేవుని మాటచొప్పునే వీరు ఆ దేశంలో సంచరిస్తున్నారు. అయినప్పటికీ వీరు ముగ్గురూ అక్కడ కరువును ఎదుర్కొన్నారు. ఇబ్బంది పడ్డారు. దీనిప్రకారం; విశ్వాసయాత్రలో మన జీవితం సుఖవంతంగా సాగిపోతుందని భావించకూడదు. కొందరు దుర్బోధకులు అలానే బోధిస్తుంటారు కాబట్టి ఈమాటలు ప్రత్యేకంగా చెబుతున్నాను. విశ్వాసయాత్రలో పితరులు ఎదుర్కొన్న కరువు లాంటి ఇబ్బందులనూ మిగిలిన శ్రమలనూ మనమూ ఎదుర్కోవలసియుంటుంది. ఉదాహరణకు యాకోబు తన జీవితం గురించి "నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి" (ఆదికాండము 47:9) అని పలకడం మనం చదువుతున్నాం (ఆ సందర్భంలో దీనిగురించి మరింత చర్చించుకుందాం). అందుకే శ్రమ కలిగినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడనే అభిప్రాయానికి ఎప్పుడూ రాకూడదు. వాటికి కారణం మన ప్రవర్తనే అయ్యుంటే వాక్యప్రకారం సరిచేసుకోవాలి, అలా కాకుండా దైవికంగానే అవి సంభవించియుంటే అవి ఆయన నిర్ణయించిన పాఠాలని గుర్తించి ఆయనపై మరింత ఆధారపడాలి. బలపడాలి.
ఆదికాండము 26:2 అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.
ఈ వచనంలో దేవుడు ఇస్సాకును ఐగుప్తుకు వెళ్ళనివ్వకుండా నిలువరించడం మనం చూస్తాం. గతంలో అబ్రాహాము ఈ కరువు వల్లే దేవునిమాటను విచారించకుండా ఐగుప్తుకు వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇస్సాకు కూడా ఆ ఐగుప్తుకు వెళ్ళే ఉద్దేశంతోనే ముందుగా గెరారు దేశానికి చేరుకున్నాడు. అందుకే దేవుడు అతడిని అడ్డుకుంటున్నాడు.
ఆదికాండము 26:3 ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను.
ఈ వచనంలో దేవుడు ఇస్సాకుకు కనానులో పరదేశిగా నివసించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. కనాను దేశం అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానానికి వాగ్దానం చెయ్యబడిన దేశం కాబట్టి ఆ ముగ్గురూ ఆ దేశంలోనే నివసించాలని ఆయన ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. క్రింది వచనాలలో ఆ మాటలే మనం చూస్తున్నాం.
ఆదికాండము 26:4 ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.
ఈ వచనంలో దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని ఇస్సాకుకు జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఈవిధంగా ఆయన మాటిమాటికి తన వాగ్దానాన్ని జ్ఞాపకం చెయ్యడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఒక మనిషి దేవునిపట్ల ఎంతగొప్ప విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పటికీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అతను అధైర్యపడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో దేవుని మాట మాత్రమే అతనికి ఊరట కలిగిస్తుంది. ఇసాకు ఇప్పుడు కరువులో ఉన్నాడు అందుకే ఆయన ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనం కూడా మన బలహీన సమయంలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తుండాలి, దీనివల్ల మనం ఎంతో ధైర్యపరచబడతాం. అందుకే కీర్తనాకారుడు "నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది." (కీర్తనలు 119:50) అని అంటున్నాడు.
ఆదికాండము 26:5 ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.
ఈ వచనంలో దేవుడు అబ్రహాము యొక్క ప్రవర్తన గురించి కూడా ఇస్సాకుకు జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. అంటే ఆ వాగ్దానానికి వారసుడవైన నువ్వు కూడా అలానే జీవించమని ఆయన బోధిస్తున్నాడు.
ఆదికాండము 26:6,7 ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె యెవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.
ఈ వచనాలలో తన భార్య వల్ల హాని సంభవిస్తుందని భయపడిన ఇస్సాకు ఆమెను చెల్లెలని చెప్పడం మనం చూస్తాం. గతంలో అబ్రాహాము కూడా ఇలానే చేసాడు. గమనించండి; ఈ సంఘటనకు ముందే దేవుడు అతనికి ప్రత్యక్షమై తన సంతానం గురించి వాగ్దానం చేసాడు, అయినప్పటికీ ఇప్పుడు అతను ప్రాణ భయంతో అబద్ధం చెబుతున్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనం కొన్ని భయానక పరిస్థితుల్లో సత్యానికి వేరుగా ప్రవర్తించకుండా జాగ్రతపడాలి. అబ్రాహాము ఇస్సాకు అంతటి వారే ఇలాంటి పొరపాట్లు చేసారంటే మనం ఇంకా చేసే అవకాశం ఉంది కాబట్టి, మనం ఆ విధంగా తప్పిపోకుండా మరింత జాగ్రతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మాటలన్నీ రాయబడ్డాయి. అందుకే "కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి" (ఫిలిప్పీ 2:12) అని ఆజ్ఞాపించబడుతున్నాం.
అదేవిధంగా ఈ సందర్భంలో కనిపిస్తున్న అబీమెలెకు, అబ్రాహాము కాలంలోని అబీమెలెకు ఒక్కరు కారు. ఐగుప్తు రాజులను ఫరోలని ఎలా సంబోధిస్తారో ఈ గెరారులో కూడా అలాంటి సాంప్రదాయం ఉండియుండవచ్చు, లేదా ఈ రాజుకు కూడా తన పితరుడి పేరే పెట్టుండవచ్చు. అలాంటి సాంప్రదాయం సాధారణం కదా!. ఎందుకంటే; ఆదికాండము 20వ అధ్యాయంలో శారాను ఇంట చేర్చుకున్న అబీమెలెకు అబ్రాహాము చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండే అవకాశం లేదు. అతను ఇంచుమించు అబ్రాహాము సమకాలికుడు కాబట్టే శారాను మోహించి తన ఇంటచేర్చుకున్నాడు.
ఆదికాండము 26:8-11 అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకొంటినని అతనితో చెప్పెను. అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను. అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా-
ఈ వచనాలలో అబీమెలెకు రిబ్కా ఇస్సాకు భార్య అని తెలుసుకుని ఆమె విషయంలో తన ప్రజలకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దేవుడు అబ్రాహాముకు తోడైయున్నట్టే ఇస్సాకుకు కూడా తోడైయున్నాడు. అందుకే ఆయన అబీమెలెకు మనస్సును ప్రేరేపించి, ఇస్సాకుకు కానీ రిబ్కాకు కానీ హాని సంభవించకుండా కాపాడాడు. కానీ చూడండి; చెప్పిన అబద్దాన్ని బట్టి అన్యుడైన అబీమెలెకు చేత గద్దించబడవలసి పరిస్థితి ఇస్సాకుకు వచ్చింది. విశ్వాసులమైన మన ప్రవర్తన అన్యులకు బుద్ధి నేర్పేదిగా ఉండాలి తప్ప వారిచేత బోధించబడేలా ఉండకూడదు. మనం లోకానికి వెలుగుగా ఉండాలి తప్ప లోకం చేత వెలిగించడేలా కాదు. ఆ పరిస్థితి మనకే కాదు మనం నమ్మిన దేవునికి కూడా ఎంతో అవమానకరం. కాబట్టి ఆయన పిల్లలు తమ సమస్త ప్రవర్తన విషయంలో లోకానికి వెలుగుగా ఉండి లోకపు చీకటిని ఖండించాలి.
అదేవిధంగా నీ పొరుగువాని భార్యను ఆశించకూడదనే ఆజ్ఞకు ముందు కాలంలో కూడా ఆ నియమం అందరికీ తెలుసని అబీమెలెకు మాటల్లో మనం చూస్తాం. దేవుడు ఇలాంటి నైతికపరమైన ఆజ్ఞలను మొదటినుండీ మనస్సాక్షి ద్వారా బోధించాడు ([simple_tooltip content='ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.']రోమా 2:14,15).
ఆదికాండము 26:12-14 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయపడిరి.
ఈ వచనాలలో ఇస్సాకుకు కలిగిన సమృద్ధిని బట్టి ఫిలిష్తీయులు అతనిపట్ల అసూయపడినట్టు మనం చూస్తాం. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకే అన్యుల నుండి అసూయను ఎదుర్కొన్నప్పుడు, ఈ క్రింది వచనాల ప్రకారం; ఆ అసూయను బట్టి అతడిని ఇబ్బంది పెట్టినప్పుడు మనకు కూడా అలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కానీ ఆ సమయంలో కృంగిపోకుండా అలానే వారితో జగడానికి కూడా సిద్ధమవ్వకుండా ఇస్సాకు ప్రవర్తించినట్టు ప్రవర్తించాలి.
ఆదికాండము 26:15 అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.
ఈ వచనంలో పిలిష్తీయులు ఇస్సాకును ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అబ్రాహాము తవ్వించిన బావులను పూడ్చివెయ్యడం మనం చూస్తాం. వారు అబ్రాహాముతో చేసుకున్న ఒప్పందాన్ని మీరుతూ ఇలా ప్రవర్తించారు (ఆదికాండము 21:22). కాబట్టి ఒప్పందాలను మీరడం అనేది దేవుణ్ణి ఎరుగనివారి లక్షణంగా మనం గుర్తించాలి, మనమైతే ఇతరులతో చేసుకున్న న్యాయమైన ఒప్పందాల విషయంలో ఎప్పటికీ తప్పిపోకూడదు. దేవుని గుడారంలో (పరలోకం) నివసించేవారికి ఉండవలసిన అర్హతలలో ఇది కూడా ఒకటి. ఆ భాగంలో "అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు" (కీర్తనలు 15: 4) అనే మాటలు చదువుతున్నాం.
ఆదికాండము 26:16,17 అబీమెలెకు నీవు మాకంటె బహుబలము గలవాడవు గనుక మాయొద్ద నుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.
ఈ వచనాలలో ఇస్సాకుకు దేవునిమూలంగా కలుగుతున్న సమృద్ధిని బట్టి అబీమెలెకు అతనిని వారి ప్రదేశం నుండి వెళ్ళిపోమనడం మనం చూస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇస్సాకు వారిపై యుద్ధం ప్రకటిస్తాడని వారు భయపడ్డారు. అయితే ఇప్పుడు కూడా ఇస్సాకు వారితో జగడమాడకుండా ఆ ప్రదేశం నుండి లోయవైపుగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే న్యాయంగా అప్పటికి ఆ ప్రదేశం వారిదే. అక్కడ ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయించే అధికారం వారికే ఉంటుంది. అందుకే ఇస్సాకు తన బలంతో జగడానికి సిద్ధపడకుండా న్యాయంగా నడుచుకుంటున్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనం మన బలాన్ని న్యాయవిరుద్ధంగా వినియోగించకుండా దేవుని న్యాయానికి భయపడి తగ్గించుకోవాలి.
ఆదికాండము 26:18-22 అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను. వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను.
ఈ వచనాలలో ఫిలిష్తీయులు ఇస్సాకును మరలా ఇబ్బంది పెట్టడం మనం చూస్తాం. అయినప్పటికీ ఇస్సాకు పోట్లాటకు దిగకుండా ఓర్పు సహనంతో దేవునిపై ఆధారపడుతున్నాడు. కాబట్టి విశ్వాసులు సాధ్యమైనంతవరకూ కలహాలకు దూరంగా ఉండాలి. అందుకే "శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి" (రోమా 12: 18) అని రాయబడింది. అలాగని మనకు సొంతమైనదానిని ఎవరో ఆక్రమించుకుంటుంటే మౌనంగా ఉండమని దీనర్థం కాదు. ఇస్సాకు ఈ దేశంలో పరవాసిగా నివసిస్తున్నాడు, ఆ భూమిపై అతనికి ఇంకా హక్కులేదు. అది అతని సంతానానికి చెందిన వాగ్దానం మాత్రమే. అందుకే అతను ఆ భూమి విషయంలో కొట్లాటకు దిగకుండా దేవునిపై ఆధారపడ్డాడు చివరికి ఆయనే అతనికి ఫిలిష్తీయుల నుంచి ఎడము కలుగచేసాడు. కానీ మనకు సొంతమైన వాటివిషయంలో ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే తప్పకుండా చట్టాన్ని ఆశ్రయించాలి, న్యాయపరిథిలో వారితో పోరాడాలి.
ఆదికాండము 26:23-25 అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను. అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.
ఈ వచనాలలో దేవుడు మరలా ఇస్సాకుకు ప్రత్యక్షమై ధైర్యపరచడం, తన వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. కనానులో అతను చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు కాబట్టి, ఆయన అతన్ని ఇలా ధైర్యపరుస్తున్నాడు. అదేవిధంగా అబ్రాహామును బట్టే ఆయన ఇస్సాకు సంతానాన్ని విస్తరింపచేస్తున్నట్టు ఇక్కడ చూస్తున్నాం.
ఆదికాండము 26:26 అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి.
ఈ వచనంలో గెరారు రాజైన అబీమెలెకు అతని సేనాధిపతితో కలసి ఇస్సాకుతో నిబంధన చేసుకోవడానికి రావడం మనం చూస్తాం. గతంలోని అబీమెలెకు కూడా అబ్రాహాము దగ్గరకు ఇలానే వచ్చాడు (ఆదికాండము 21:22). ఎందుకంటే అబ్రాహాము, ఇస్సాకులకు దేవుడు తోడైయుండడాన్ని వారు స్పష్టంగా గ్రహించారు. ఆ భయంతోనే ఒప్పందాలకు సిద్ధపడ్డారు. అలానే ఈ రెండు సందర్భాలలోనూ అబీమెలకుల సేనాధిపతి పేరు ఫీకోలుగానే రాయబడింది, ఆ కాలంలో తండ్రుల పేర్లు పిల్లలకు పెట్టబడడం సహజమని ఇప్పటికే వివరించాను. అబీమెలెకుకు తన తండ్రిపేరు పెట్టబడినట్టే ఫీకోలు విషయంలోనూ జరిగింది.
ఆదికాండము 26:27-31 ఇస్సాకు మీరు నామీద పగపట్టి మీయొద్దనుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా వారు నిశ్చ యముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితిమి గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధనచేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగ నంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.
ఈ వచనాలలో ఇస్సాకు అబీమెలెకుతో సమాధానపడి అతడికి ప్రమాణం చెయ్యడం మనం చూస్తాం. గతంలో వారు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఇప్పుడు తగ్గించుకుని తనయొద్దకు వచ్చారు. అందుకే ఇస్సాకు దానికి అంగీకరించాడు. కాబట్టి విశ్వాసులమైన మనం గతంలో మనకు కీడుచేసినవారు మనతో సమాధానపడాలని చూసినప్పుడు తృణీకరించకూడదు, వారిపై ద్వేషముంచుకోకూడదు. ఎందుకంటే దేవునివాక్యం మనకు ఎనలేని క్షమాగుణాన్ని నేర్పిస్తుంది.
అయితే ఇస్సాకు మొదట వారు తనపట్ల చేసిన తప్పిదాన్ని బట్టి వారిని గద్దించాడు. అతను అలా చెయ్యకుంటే వారివల్ల ఇస్సాకు ఎంత ఇబ్బందిపడ్డాడో వారికి తెలియకపోవచ్చు. మనం కూడా అవతలివారు తమ తప్పిదాన్ని గ్రహించేవిధంగా గద్దించగలగాలి. అందుకే యేసుక్రీస్తు "నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము" (మత్తయి 18:15) అని నేర్పించాడు. కాబట్టి ఇతరులతో సమాధానపడడం ఎంతముఖ్యమో వారి అపరాధాన్ని బట్టి గద్దించడం కూడా అంతే ముఖ్యం.
ఆదికాండము 26:32,33 ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసిమాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.
ఈ వచనాలలో బెయేర్షెబా అనే పేరు గురించి మనం చూస్తాం, వాస్తవానికి ఈ బావికి బెయేర్షెబా అనేపేరు అబ్రాహామే పెట్టాడు (ఆదికాండము 21:31). అబ్రాహాము చనిపోయాక పిలిష్తీయులు ఆ బావులను పూడ్చివేసారు కాబట్టి ఇస్సాకు మరలా వాటిని తవ్వించి, తన తండ్రి పెట్టిన పేర్లనే వాటికి మళ్ళీ పెట్టే క్రమంలో ఆ పేరునూ ప్రస్తావించాడు (18వ వచనం).
ఆదికాండము 26:34,35 ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లి చేసికొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.
ఈ వచనాలలో ఏశావు కనానీయుల కుమార్తెలను వివాహం చేసుకున్నట్టు వారు అతని తల్లితండ్రులకు వేదన కలుగచేసినట్టు మనం చూస్తాం. ఏశావు ఇలాంటి పని చెయ్యడంలో ఇస్సాకు అశ్రద్ధ కూడా మనకు కనిపిస్తుంది. 24వ అధ్యాయం ప్రకారం; అబ్రాహాము ఇతని వివాహం విషయంలో ఎంతో జాగ్రతను తీసుకుంటూ ఎలీయెజెరు ద్వారా తన బంధువుల కుమార్తెను రప్పించాడు. కానీ ఇస్సాకు అలాంటి జాగ్రత్త తీసుకోకుండా బావులను తవ్వించే పనిలో నిమగ్నమయ్యాడు. ఎందుకంటే ఏశావు ఎవరి కుమార్తెలనైతే వివాహం చేసుకున్నాడో ఆ బేయేరీ, ఏలోనులు అనేవి వారి వ్యక్తిగత పేర్లు కావు. బేయేరీ అంటే బావులు తవ్వించేవాడని, ఏలోను అంటే ఒప్పందాలు చేసేవాడని అర్థం వస్తుంది. ఇస్సాకుకు తన తండ్రి తవ్వించిన బావులను మళ్ళీ తవ్వించే పనిలో సహాయపడినవారే ఈ ఇద్దరూ. ఆ విధంగా ఇస్సాకు కుటుంబంతో వారి కుటుంబానికి సాంగత్యం ఏర్పడి ఏశావు వారి కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఒకవిధంగా ఇది ఏశావు దేవుని చేత తృణీకరించబడ్డాడు అనేందుకు కూడా సాక్ష్యంగా ఉంది. అదేవిధంగా, ఆదికాండము 36 వ అధ్యాయంలో రాయబడిన ఏశావు భార్యల పేర్లకూ ఈ సందర్భంలో కనిపిస్తున్న పేర్లకూ మధ్య వైరుధ్యం కనిపిస్తుంది, దాని గురించి ఆ అధ్యాయపు వ్యాఖ్యానంలో చూద్దాం.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 26

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"