పాత నిబంధన

ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృష్టించెను.
బైబిల్ గ్రంథం ప్రారంభవచనములోనే దేవుడు ఉన్నాడనీ,ఆయన ఈ సమస్త సృష్టినీ తన ప్రణాళిక చొప్పున క్రమబద్ధంగా సృష్టించాడనీ తెలియచేస్తుంది. ఈ వాక్యభాగము పైన ఎన్నో సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయి.

 

ఆదికాండము 2:1,2,3- ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూ హమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పనియంతటి నుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.

 

 ఆదికాండము 3:1 - దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదైయుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.

ఆదికాండము 4:1

 ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.

ఆదాము హవ్వలకు మీరు ఫలియించి అభివృద్దిచెందండని దేవుడిచ్చిన ఆశీర్వాదఫలితంగా ఈ భూమిపైన స్త్రీ పురుషుల కలయిక వలన మొట్టమొదటిగా జన్మించిన మానవుడే కయీను.

ఆదికాండము 5:1- ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను.

రెండవ అధ్యాయపు వివరణలో దేవుని పోలిక, దేవుని స్వరూపంలో మానవునిని చేయడమంటే, అది శారీరక రూపం గురించి చెప్పడం లేదనీ, మానవునిలో దేవుడు ఉంచిన నైతిక గుణలక్షణాల గురించి చెబుతుందని వివరించుకున్నాము.

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.