సంఖ్యాకాండము 9:1-3 ఐగుప్తు దేశములోనుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.
ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరివచ్చిన రెండవ సంవత్సరం మొదటినెలలో పస్కా పండుగను ఆచరించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ పండుగ రోజే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరివచ్చారు. దానిని గురించిన వివరణ (కట్టడ) నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన ఇక్కడ మరోసారి ఆ కట్టడను జ్ఞాపకం చెయ్యడం ద్వారా వారి విమోచనను మరచిపోవద్దని హెచ్చరిస్తున్నాడు.
సంఖ్యాకాండము 9:4,5 కాబట్టి మోషే పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి.
ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞ ప్రకారం పస్కాపండుగకు సిద్ధపడినట్టు మనం చూస్తాం. ఇది ఇశ్రాయేలీయులు అరణ్యంలో పాటిస్తున్న మొదటి పస్కా. ఇక "పదునాలుగవ దినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి" అంటే నిర్గమకాండము 12:3-9 లో వివరించబడినట్టు ఒక మేకపిల్లను కానీ గొర్రెపిల్లను కానీ తినే వ్యక్తుల సంఖ్యను బట్టి సిద్ధపరచుకున్నారని అర్థం.
సంఖ్యాకాండము 9:6 కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింపలేకపోయిరి.
ఈ వచనంలో ప్రజల్లో కొందరు నరశవాన్ని ముట్టడం వల్ల పస్కాను ఆచరించలేకపోవడం మనం చూస్తాం. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం నరశవాన్ని ముట్టినవారు అపవిత్రులు (సంఖ్యాకాండము 19:11). వారు పవిత్రులు అయ్యేంతవరకూ పరిశుద్ధమైవాటిని తినకూడదు (లేవీకాండము 7:20,21). ఆ నియమాన్ని బట్టే వారు పస్కాను పాటించకుండా ఉండిపోయారు.
గమనించండి; ఇక్కడ వారు మనం అపవిత్రులమైతే ఏంటి దేవుడు ఆజ్ఞాపించిన పండుగనే పాటిస్తున్నాం కదా అనుకోలేదు. దేవుడు ఆజ్ఞాపించిన పండుగను దేవుడు ఆజ్ఞాపించిన స్థితిలోనే ఉండి పాటించాలని అనగా పవిత్రులుగా ఉండే దానిని పాటించాలని ఎరిగి తాము అపవిత్రులైన కారణంగా పాటించడం మానివేసారు. పరిశుద్ధమైన పండుగలో పవిత్రులుగా ఉండే పాల్గోవాలనే వారి ధర్మశాస్త్రానుసారమైన భక్తి మనకు మంచి మాదిరి. దానిని బట్టి పరిశుద్ధమైన సంఘ కార్యక్రమాలలో పరిచర్యలలో పాల్గొనే మనం కూడా పవిత్రులుగా అందులో పాలుపంచుకోవాలి.
సంఖ్యాకాండము 9:7,8 వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుటవలన అపవిత్రులమైతిమి; యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా మోషే నిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసికొందునని వారితో అనెను.
ఈ వచనాలలో నరశవాన్ని ముట్టడం వల్ల అపవిత్రులై పస్కాను పాటించలేకపోయినవారు మోషే వద్దకు వచ్చి ఆ విషయం విన్నవించుకోవడం, అందుకు మోషే దేవుని యొద్ద విచారణకు సిద్ధపడడం మనం చూస్తాం. గమనించండి; వారు అపవిత్రులమయ్యామనే కారణంతో పరిశుద్ధమైన పస్కాను పాటించనప్పటికీ మరలా "యెహోవా అర్పణమును దాని నియామకకాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని" ఆ విషయంలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అంటే మొదటిగా తమకు తెలిసిన ఆజ్ఞ ప్రకారం పస్కాకు దూరంగా ఉన్నారు, మరలా దేవుడు ఆజ్ఞాపించిన ఆ పండుగను పాటించలేకపోయామని మోషేకు విన్నవించుకుంటున్నారు.
మరో విషయం ఏంటంటే; వారేమీ కావాలని అపవిత్రులయ్యి ఆ పండుగను పాటించకుండా ఉండలేదు. తమ బంధువుల్లోనో సన్నిహితుల్లోనో ఎవరో ఒకరు చనిపోవడాన్ని బట్టి వారిని మోసుకెళ్ళి పూడ్చిపెట్టే బాధ్యత వారిదే కాబట్టి ఆవిధంగా అనుకోకుండా లేక కారణాన్ని బట్టి అపవిత్రులయ్యారు. అయినప్పటికీ నరశవాన్ని ముట్టినవాడు అపవిత్రుడు అనే దేవుని ఆజ్ఞను బట్టి పరిశుద్ధమైన పస్కా పండుగలో పాల్గోకుండా ఆ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు, ఆ పండుగలో పాల్గోవాలనే తమ ఆసక్తిని కనుపరుస్తున్నారు. వారు చూపించిన ఈ మాదిరిని బట్టి కావాలనే అపవిత్రులై మరలా పరిశుద్ధమైన సంఘ కార్యక్రమాల్లో పాల్గొనే దుర్మార్గులూ లేదా కావాలనే అపవిత్రులై ప్రభువు బల్ల వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండే దేవుని ఆజ్ఞాపించిన కార్యక్రమాల పట్ల ఆసక్తి లేనివారూ బుద్ధితెచ్చుకోవాలి. పవిత్రులుగా దేవుడు ఆజ్ఞాపించిన సంఘ కార్యక్రమాల్లో పాల్గోవడానికి ఆసక్తి చూపించాలి.
సంఖ్యాకాండము 9:9-12 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అపవిత్రుడైనను, దూరప్రయాణము చేయు చుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను. వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను. వారు మరునాటివరకు దానిలో కొంచె మైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు; పస్కాపండుగ విషయమైన కట్టడలన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను.
ఈ వచనాలలో పస్కాను పాటించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇశ్రాయేలీయులకు దేవుని సమాధానం మనం చూస్తాం. దానిప్రకారం; నరశవాన్ని ముట్టడం వల్ల అపవిత్రులైనవారు కానీ దూరప్రయాణంలో ఉన్నవారు కానీ మొదటి నెల (అబీబు) 14వ తేదీన పస్కాను పాటించలేకపోతే రెండవ నెల (ఇయార్/జీవ్) 14వ తేదీన దానిని పాటించాలి. దీనినే second Passover అంటారు. ఈ నియమం తమ ప్రమేయం లేకుండా శారీరక అపవిత్రతలకు గురైన అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ ఆయన పండుగపై ఆసక్తిగలవారి పట్ల దేవుని కృపను మనం చూస్తున్నాం. ఆ కృపను బట్టే ఆయన వారికి ఈ ప్రత్యామ్నాయం ప్రవేశపెడుతున్నాడు.
గమనించండి; వారు కావాలని అపవిత్రులు కాలేదు, అందుకే ఆయన పస్కా పండుగను ఆచరించడానికి వారికి మరో అవకాశం కల్పిస్తున్నాడు. పండుగను పాటించడమైతే తప్పనిసరి. ఎందుకంటే అది వారి విమోచనకు గుర్తుగా క్రీస్తుకు ఛాయగా నియమించబడింది. ఇదేవిధంగా మనం కూడా ఆయన ఆజ్ఞలపట్ల ఆసక్తి పరులమైతే వాటివిషయంలో తప్పిపోకుండా ఆయనే మనల్ని కాపాడుతాడు.
"పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను. వారు మరునాటివరకు దానిలో కొంచె మైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు"
second Passover లో కూడా పస్కాకు సంబంధించిన అదే నియమాలు వర్తిస్తాయి (నిర్గమకాండము 12). నెల మారినా నియమాలు మారవు. ఎందుకంటే పైన వివరించినట్టు అవన్నీ వారి విమోచనకు గుర్తుగా క్రీస్తుకు ఛాయగా నియమించబడ్డాయి.
సంఖ్యాకాండము 9:13 ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను.
ఈ వచనంలో దూరప్రయాణం లో ఉండని పవిత్రుడు పస్కాను పాటించకపోతే ఎదుర్కోవలసిన పర్యవసానం గురించి మనం చూస్తాం. ఎందుకంటే అతనికి అవకాశం ఉన్నప్పటికీ అనగా అతను దూరప్రయాణంలో లేడు, ఎలాంటి అపవిత్రతకూ గురికాలేదు. అయినా కూడా పస్కాను పాటించకపోవడం అంటే దేవుడు వారి విమోచనకు గుర్తుగా ప్రవేశపెట్టిన పండుగను లేక ఆయన ఆజ్ఞను ఉద్దేశపూర్వకంగా తృణీకరించడమే. అందుకే అతను ప్రజల్లో నుండి కొట్టివెయ్యబడతాడు అనగా ప్రజాసంఖ్యలో లెక్కించబడడు, లేదా సంతానం లేకుండా చనిపోతాడు, లేదా దేవుని ఉగ్రతను బట్టి మరణానికి గురౌతాడు. ఆవిధంగా తన పాపాన్ని భరిస్తాడు. నేటి సంఘంలో కూడా ఉద్దేశపూర్వకంగా దేవుని ఆజ్ఞలను తృణీకరించేవారికి ఈ మాటలు కఠినమైన హెచ్చరికగా ఉన్నాయి. అలాంటి పాపం గురించే "మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును" (హెబ్రీ 10:26,27) అని రాయబడింది.
సంఖ్యాకాండము 9:14 మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.
ఈ వచనంలో దేవుడు పరదేశులకు అనగా ఇశ్రాయేలీయులు కాని వారికి కూడా పస్కాలో పాల్గొనే అవకాశం కల్పించడం మనం చూస్తాం. దానిని బట్టి ఎవరైనా పరదేశులు ఆ పండుగలో పాల్గోవాలంటే దాని కట్టడ చొప్పున పాల్గోవచ్చు. కట్టడ మాత్రం ఒక్కటే (నిర్గమకాండము 12). అయితే మొదటిగా ఆ పరదేశులు నిబంధన ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో చేర్చబడాలి, దానికి నిబంధన గురుతైన సున్నతిని చేయించుకోవాలి (నిర్గమకాండము 12:48). ఎందుకంటే నిబంధన ప్రజల్లో చేర్చబడకుండా నిబంధన సంబంధమైనవాటిలో పాల్గోవడం సాధ్యం కాదు. పస్కా విషయంలో పరదేశులకు కూడా ఈ అనుమతి క్రీస్తులో ఏ బేధమూ ఉండదు అనేదానికి సాదృష్యంగా ఉంది (గలతీ 3:27,28), ఆయన నిబంధన ప్రజలుగా మారిన అందరూ ఆయన రక్షణలో ప్రవేశించవచ్చు. అయితే ఒకే కట్టడను బట్టి అనగా ఒకే వాక్యాన్ని బట్టి ఆయనలో నిలిచియుండాలి. జాతులు మారినా దేశాలు మారినా కట్టడ మారదు.
సంఖ్యాకాండము 9:15,16 వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను. నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.
యెహోవా దేవుడు ప్రత్యక్షగుడారం ద్వారా తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు లేక వారి మధ్య ఆయన మహిమను ఉంచుతున్నాడు అనడానికి ఈ సంఘటన నిదర్శనం (నిర్గమకాండము 40:34-38). భీకరమైన ఎడారిలో ఆయన పగలు వారికి ఎండదెబ్బ తగలకుండా మేఘాన్ని ఉంచుతున్నాడు, రాత్రిచీకటి భయం లేకుండా అగ్నిని ఉంచుతున్నాడు.
సంఖ్యాకాండము 9:17-23 ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి. యెహోవా నోటిమాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి. యెహోవా నోటిమాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాట చొప్పుననే ప్రయాణము చేసిరి. ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచిన యెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవు చేసి మందిరము మీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పున వారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పినమాటనుబట్టి యెహోవా ఆజ్ఞ ననుసరించి నడిచిరి.
ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులను నడిపిస్తున్న పద్ధతి గురించి మనం చూస్తాం. ఆయన ప్రత్యక్షగుడారంపై తన మహిమ మేఘాన్ని ఉంచడం, తొలగించడం ద్వారా వారిని నడిపిస్తున్నాడు. ఆయన నోటి మాటను బట్టి ఆయన మహిమ మేఘాన్ని బట్టి వారిని నడిపిస్తున్నాడు. తమంతట తాముగా ప్రయాణించే నిలిచే స్వేచ్చను వారికి ఇవ్వలేదు. ఈ నియమాన్ని బట్టి ఈలోకంలో మనం దేవుని నోటి మాటయైన వాక్యాన్ని బట్టే నడుచుకోవాలని నేర్చుకుంటున్నాం.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
సంఖ్యాకాండము అధ్యాయం 9

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"