సంఖ్యాకాండము 7:1,2 మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి, దాని ఉపకరణములన్నిటిని బలి పీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబ ములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింప బడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి.
ఈ వచనాలలో నిర్గమకాండము 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకూ దేవుడు ఆజ్ఞాపించిన ప్రత్యక్షగుడారం నిలబెట్టబడినాక ఇశ్రాయేలీయుల ప్రధానులు ఆ ప్రత్యక్షగుడారానికి అర్పణలు తీసుకువచ్చినట్టు మనం చూస్తాం. ఈ అర్పణలు ప్రజల ఆరాధనకు సాదృష్యంగా ఉన్నాయి, అందుకే ప్రతీగోత్రపు ప్రధానీ తమ తమ గోత్రం తరపున అర్పణలు తీసుకువచ్చాడు. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి, ప్రత్యక్షగుడారం మరియు దాని సంబంధిత వస్తువులన్నీ ప్రజల ఇచ్చిన అర్పణలతోనే నిర్మించ (తయారుచెయ్య) బడ్డాయి. అంటే ప్రజలు అప్పటికే విస్తారంగా దేవుని కోసం ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యక్షగుడారం నిలబెట్టబడ్డాక మళ్ళీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇవ్వబడేవి కూడా ప్రత్యక్షగుడారపు సేవకే ఇవ్వబడుతున్నాయి. దీనినిబట్టి మనం సంఘ పరిచర్య కోసం అవసరాన్ని బట్టి ఇస్తూనే ఉండాలని నేర్చుకుంటున్నాం.
సంఖ్యాకాండము 7:3 వారు ఇద్దరిద్దరికి ఒక్కొక బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక యెద్దు చొప్పునను, ఆరు గూడు బండ్లను పండ్రెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొని వచ్చిరి.
ఈ వచనంలో ఇశ్రాయేలీయుల ప్రధానులు ఒక్కో గోత్రానికి ఒక్కో ఎద్దు చొప్పున రెండేసి గోత్రాలు కలిపి ఒక్కో ఎద్దుల బండిని మొత్తం ఆరు ఎద్దుల బండ్లను దేవుని సన్నిధికి తీసుకువచ్చినట్టు మనం చూస్తాం. వాటి సహాయంతోనే అరణ్యంలో ప్రత్యక్షగుడారం ఒకచోటినుండి మరోచోటికి మార్చబడేటప్పుడు దానిసంబంధిత పలకలనూ స్థంభాలనూ తెరలనూ త్రాళ్ళనూ తీసుకెళ్ళేవారు. గమనించండి; కావాలంటే ఒక్కో గోత్రమూ ఒక్కో ఎద్దులబండిని ఇవ్వగలదు, వారి పశుసంపదకు ఏ లోటూ లేదు. కానీ అక్కడ అవసరాన్ని బట్టి రెండేసి గోత్రాలు కలపి ఒక్కో ఎద్దుల బండిని సమర్పించారు. ఆవిధంగా ప్రతీగోత్రమూ ప్రత్యక్షగుడారం ముందుకు సాగడంలో సమానంగా పాలుపంచుకున్నారు. ఈ నియమాన్ని బట్టి సంఘ అవసరలతల్లో అందరూ పాలు పంచుకునేలా అందరికీ ఆ ఘనత దక్కేవిధంగా ఇవ్వాలని నేర్చుకుంటున్నాం.
సంఖ్యాకాండము 7:4,5 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు వారియొద్ద ఈ వస్తువులను తీసికొనుము; అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై యుండును; నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను.
ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రధానులు ఇస్తున్న కానుకలను ముఖ్యంగా ఎద్దుల బండ్లను తీసుకోమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. కారణం "అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై యుండును" అని చెబుతున్నాడు. గమనించండి; ఇశ్రాయేలీయులు ప్రధానులు తీసుకువచ్చినంత మాత్రాన మోషే వాటిని స్వీకరించలేదు, దేవుని అనుమతి కోసం ఎదురుచూసాడు. ఆయన "అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై యుండును" అని వాటి అవసరతను తెలియచేసాకే వాటిని తీసుకుంటున్నాడు. ఈ నియమాన్ని బట్టి సంఘనాయకులు కూడా విశ్వాసులు ఇస్తున్నారులే అని తీసుకుంటూ పోకూడదు, సంఘ అవసరతలను బట్టే వారి నుంచి స్వీకరించాలి. అందుకే ఇదే మోషే గతంలో కూడా ప్రజలనుండి అవసరానికి మించిన అర్పణలు వస్తున్నప్పుడు వాటిని నిషేధించాడు (నిర్గమకాండము 36:6).
"నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను"
ఇక్కడ దేవుడు ఆ ఎద్దులబండ్లను లేవీయులకు ఏవిధంగా పంచాలో వివరించడం మనం చూస్తాం. "వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను" అంటే వారి సేవయొక్క అవసరాన్ని బట్టి వారికి ఇవ్వాలి. వారందరికీ ఒకేవిధమైన సేవ నిర్ణయించబడలేదు కాబట్టి ఏ సేవలో అవి ఎంతమట్టుకు అవసరమో దానిని బట్టే ఇవ్వాలి. ఆ పంపకం గురించి క్రింది వచనాలలో చూస్తాం.
సంఖ్యాకాండము 7:7-9 అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవచేయు మెరారీయులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను. కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు.
ఈ వచనాలలో "వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను" అని దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఆ ఎద్దులబండ్లను లేవీయుల్లో ఎవరికి ఎలా పంచాడో మనం చూస్తాం. "అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గెర్షోనీయులకిచ్చెను". సంఖ్యాకాండము 4:24-28 ప్రకారం; ఈ గెర్షోనీయులకు మందిరపు తెరలు, త్రాళ్ళు తరలించే బాధ్యత అప్పగించబడింది. అవి చేతులతో మోసుకెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి వారికి రెండు ఎడ్లబండ్లు ఇవ్వబడ్డాయి. "అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవచేయు మెరారీయులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను" సంఖ్యాకాండము 4:29-33 ప్రకారం; ఈ మొరారీయులకు మందిరపు పలకలు, స్థంబాలు తరలించే బాధ్యత అప్పగించబడింది. అవి కూడా చేతులతో మోసుకెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి వారికి నాలుగు ఎద్దులబండ్లు ఇవ్వబడ్డాయి. గమనించండి, గెర్షోనీయుల కంటే వీరికి రెండు ఎద్దులబండ్లు ఎక్కువ ఇవ్వబడ్డాయి. ఎందుకంటే తెరలు త్రాళ్ళు కంటే పలకలూ స్థంబాలూ బరువుగా మరియు ఎక్కువగా ఉంటాయి. అందుకే మొరారీయులకు మొత్తం నాలుగు ఎద్దులబండ్లు ఇవ్వబడ్డాయి. ఈవిధంగా మోషే "వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను" అనే దైవాజ్ఞను బట్టి ఎవరి కష్టం చొప్పున వారికి వాటిని పంచాడు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించవలసిన మరో విషయం ఏంటంటే; దేవుడు వీరికి సేవను అప్పగించడమే కాదు ఆ సేవను నిర్వహించేలా సహాయాన్ని కూడా అందిస్తున్నాడు.
"కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు"
సంఖ్యాకాండము 4:1-15 ప్రకారం; ఈ కహతీయులకు ప్రత్యక్షగుడారానికి సంబంధించిన పరిశుద్ధవస్తువులను అనగా మందసాన్ని, దీపవృక్షాన్ని, బలిపీఠాన్ని, సన్నిధిబల్లను తరలించే బాధ్యత అప్పగించబడింది. అవి పరిశుద్ధమైనవీ ప్రాముఖ్యమైనవీ కాబట్టి దేవుడు వాటిని వీరు భుజాలపైనే మొయ్యాలని ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే వీరికి ఎద్దులబండ్లు ఇవ్వబడలేదు. దావీదు ఈ విషయంలో పొరపాటు చెయ్యబట్టే అనగా మందసాన్ని యాజకులు భుజంపై మోసేలా చెయ్యకుండా ఎద్దులబండిపై పెట్టి తీసుకురాబట్టే దేవునికోసం అతనిపై రగిలింది, ఉజ్జా మరణానికి అది కూడా ఒక కారణం (1 దినవృత్తాంతములు 15:13). గమనించండి; కహతీయులకు ప్రధానమైన బాధ్యత అప్పగించబడింది. కానీ అది వారు భుజాలపైనే చెయ్యాలి. అంటే కష్టపడాలి. కాబట్టి పరిచర్యలో ప్రధానమైన బాధ్యతలు తీసుకున్నప్పుడు దానికి తగిన కష్టాన్ని కూడా భరించాలని నేర్చుకుంటున్నాం.
సంఖ్యాకాండము 7:10,11 బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను.
ఈ వచనాలలో బలిపీఠం ప్రతిష్టించబడిన రోజున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పణలు తేవడం దేవుడు ఒక్కో ప్రధాని అర్పణనూ ఒక్కోరోజు అర్పించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అంటే వారందరూ ఒకేరోజునే అర్పణ తీసుకువచ్చినప్పటికీ దేవుడు ఒక్కరోజే వాటిని అర్పించనివ్వకుండా రోజుకు ఒక్కరు చొప్పున అనగా పన్నెండు రోజుల పాటు తమ అర్పణలు అర్పించాలని ఆజ్ఞాపించాడు. దీనివల్ల ప్రతీగోత్రపు ప్రధానీ తనకు కేటాయించబడిన రోజు అర్పణ అర్పించడం ద్వారా ప్రతీ గోత్రానికి ఘనత కలుగుతుంది.
సంఖ్యాకాండము 7:12-17 మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీమనాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱె పిల్లను అపరాధ పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీమనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణ
ఈ వచనాలలో మొదటిగా యూదా గోత్రానికి ప్రధానియైన నయస్సోను తన అర్పణాన్ని తీసుకురావడం మనం చూస్తాం. మెస్సీయ ఈ గోత్రం నుండే రాబోతుండడం కారణంగా మొదటి నుండీ ఈ యూదా గోత్రానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది, శిబిరంలో కూడా వీరే మొదట ఉంటారు (సంఖ్యాకాండము 2). అలా బలిపీఠపు ప్రతిష్టరోజున మొదటి అర్పణం కూడా వీరిదే. ఇక ఈ గోత్రపు అర్పణం దగ్గరకు వస్తే; ఒక వెండిగిన్నె, వెండి పాత్ర, ఆ రెండింటి నిండా నూనె కలిపిన గోధుమపిండి, ధూపద్రవ్యంతో నిండిన బంగారు ధూపార్తి, దహన బలిగా ఒక చిన్న దూడ, ఒక పొట్టేలు ఏడాది గొఱ్ఱె పిల్ల, అపరాధ పరిహారార్థబలిగా ఒక మేకపిల్ల, సమాధానబలిగా రెండు దూడలు, ఐదు పొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, సంవత్సరం లోపు ఐదు గొఱ్ఱెపిల్లలు అనేవి వీరి అర్పణ. ఇవన్నీ వారు దేవుని పట్ల తమ కృతజ్ఞతకూ ఆరాధనా భావానికీ సాదృష్యంగా తీసుకురావడం జరిగింది. లేవీకాండము 1 నుండి 4 అధ్యాయాల్లో ఈ మూడురకాల బలుల గురించీ గోధుమపిండి నైవేధ్యం గురించీ వివరించబడింది.
గమనించండి; వారు అర్పించిన బంగారం, వెండి, బలులు కూడా విలువైనవే. అయినప్పటికీ వారు దేవుని పట్ల తమ కృతజ్ఞతనూ ఆరాధననూ చాటుకోవడానికి వాటిని అర్పించారు. కాబట్టి దేవుని పట్ల ఆరాధన, కృతజ్ఞత అంటే నోటితోనూ చేతులతోనూ చెల్లించేది మాత్రమే కాదు, అవసరాన్ని బట్టి ఆయనకోసం విలువైనవి మనం ఇవ్వగలగాలి. ముఖ్యంగా విలువైన మన దేహాన్ని ఆయనకు సజీవయాగంగా సమర్పించాలి (రోమా 12:1).
సంఖ్యాకాండము 7:18-82 రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడు నైన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము. నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదే యూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడా దివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము. అయిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీష దాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్నకోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్ల లను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము. ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూ వేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టే లును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయూ వేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము. ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱెపిల్లను పాప పరిహారార్థబలిగా ఒక మేక పిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణ ముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీ షామా అర్పణము. ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదా సూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను అపరాధపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధమపిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది షెకెలుల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము. పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీష దాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీ యెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తు గల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడా దివి అయిదు గొఱ్ఱెపిల్ల లను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఆమీషదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము. పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. పండ్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తినిఒ దహనబలిగా ఒక చిన్నకోడెను ఒకపొట్టె లును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీర అర్పణము.
ఈ వచనాలలో మిగిలిన పదకొండు గోత్రాల ప్రధానులూ తీసుకువచ్చిన అర్పణల గురించి మనం చూస్తాం. అందరి అర్పణా ఒక్కటే. అదే ఒక వెండిగిన్నె, వెండి పాత్ర, ఆ రెండింటి నిండా నూనె కలిపిన గోధుమపిండి, ధూపద్రవ్యంతో నిండిన బంగారు ధూపార్తి, దహన బలిగా ఒక చిన్న దూడ, ఒక పొట్టేలు ఏడాది గొఱ్ఱె పిల్ల, అపరాధ పరిహారార్థబలిగా ఒక మేకపిల్ల, సమాధానబలిగా రెండు దూడలు, ఐదు పొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, సంవత్సరం లోపు ఐదు గొఱ్ఱెపిల్లలు. 12-17 వచనాల వ్యాఖ్యానంలో వివరించినట్టుగా ఇవన్నీ ఆయన పట్ల కృతజ్ఞతకూ ఆరాధనా భావానికీ సాదృష్యంగా వారు అర్పించారు. ఇక్కడ మనం రెండు ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి.
1. ప్రతీగోత్రం అర్పించిన అర్పణ ఒక్కటే ఐనా దేవుడు ప్రతీగోత్రపు అర్పణనూ విడిగా రాయించడాన్ని బట్టి ఆయనకు అన్ని గోత్రాలూ సమానమే అని తెలియచేస్తున్నాడు. ప్రతీ గోత్రానికీ ఘనత కలుగచేస్తున్నాడు. అందుకే అన్నీ గోత్రాలూ ఒకేరోజు కాకుండా రోజుకు ఒక గోత్రం చొప్పున తమ అర్పణను అర్పించాలని ఆయన ఆజ్ఞాపించాడు.
2. అన్ని గోత్రాలు తీసుకువచ్చిన అర్పణా ఒక్కటే. అది దేవుని ఆజ్ఞ. అంటే అన్ని గోత్రాలూ సమానంగా అర్పించాలని ఆయన నిర్ణయించాడు. ఎందుకంటే ఒక గోత్రం తీసుకువచ్చింది విలువైనది, మరో గోత్రం తీసుకువచ్చింది కొంచెం విలువ తక్కువది అనే ఆలోచనలకు ఎవరి మనసులోనూ తావులేకుండా ఆయన ఇలా నిర్ణయించాడు.
అదేవిధంగా ధర్మశాస్త్రం మోషే కల్పించిందో లేక ఇతరులెవ్వరో తర్వాత రాసిందో కాదని మోషే దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టే ఇదంతా రాసాడని చెప్పడానికి ఈ లేఖనభాగం మరో చిన్న ఆధారం. ఎందుకంటే ఇదంతా మోషే కల్పితమే ఐతే ఒక అక్షరం రాయడానికే కష్టపడవలసిన ఆరోజుల్లో ఒకేవిధమైన ప్రతీగోత్రపు అర్పణ గురించీ మరలా మరలా ఇంత వివరంగా రాసేవాడు కాదు. పైన వివరించినట్టు ప్రతీగోత్రమూ దేవుని దృష్టిలో సమానం, ప్రతీ గోత్రానికీ ఘనత కలగాలి అనే దేవుని ఉద్దేశాన్ని బట్టే మోషే ఆత్మప్రేరణతో ప్రతీగోత్రం గురించీ ఇంత వివరంగా రాసాడు.
సంఖ్యాకాండము 7:83-88 బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణపాత్రలు పండ్రెండు, బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది. ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుధ్ద మైన తులపు పరిమాణ మునుబట్టి రెండు వేల నాలుగువందల తులములది. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపా ర్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది. ఆ ధూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగమేకపిల్లలు పండ్రెండు,
సమాధానబలి పశువులన్నియు ఇరువది నాలుగు కోడెలు, పొట్టేళ్లు అరువది, మేకపోతులు అరువది, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు అరువది.
ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు తీసుకువచ్చిన అర్పణలన్నీ మరలా జ్ఞాపకం చెయ్యబడడం మనం చూస్తాం. వారు అందరూ కలసి అర్పించిన వెండి; ఒక్కోటీ 130 తులాల వెండి కలిగిన 12 గిన్నెలూ ఒక్కోటీ 70 తులాల వెండి కలిగిన 12 ప్రోక్షణ పాత్రలు. మొత్తం వెండి 2400 తులాలు. ఒక్కోటీ 10 తులాల బంగారం కలిగిన 12 ధూపార్తులు. మొత్తం బంగారం 120 తులాలు. దహనబలికి 12 ఎద్దులు, 12 పొట్టేళ్ళు, 12 గొఱ్ఱెపిల్లలు. పాపపరిహారార్థబలికి 12 మగ మేకపిల్లలు. సమాధాన బలికి 24 ఎద్దులు, 60 పొట్టేళ్ళు, 60 మేకపోతులు, 60 గొఱ్ఱెపిల్లలు వారు అర్పించారు. ఇవన్నీ చాలా విలువైన అర్పణలు. దేవునిపట్ల తమ ఆరాధనా భావం ఇంకా విలువైనది కాబట్టి వారు దానికి తగ్గట్టుగా ఈ విలువైనవి అర్పించారు.
సంఖ్యాకాండము 7:89 మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసము మీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.
నిర్గమకాండము 25:22 లో "అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను" అని దేవుడు పలికిన మాటలకు ఈ వచనం నెరవేర్పు. ప్రత్యక్షగుడారానికి ముందు సీనాయి పర్వతం పైన మోషేతో మాట్లాడిన ఆయన ఆ గుడారం స్థాపించబడ్డాక మందసం పైనున్న కరుణాపీఠం మధ్యనుండి అతనితో మాట్లాడుతున్నాడు. మోషే కూడా ఆయనకు జవాబునిస్తున్నాడు.
ఈ అనుమతి కేవలం మోషేకు మాత్రమే పరిమితం ఇతరులెవ్వరికీ చివరికి ప్రధానయాజకుడికి కూడా అలాంటి భాగ్యం దక్కదు. చివరికి మందసం ఉన్న స్థలంలోకి ప్రవేశించినా మరణం తప్పదు. ఈ నియమం మోషే ఒక్కడే దేవునికీ ప్రజలకూ మధ్యలో మధ్యవర్తియని తెలియచేస్తుంది. ఈ మధ్యవర్తిత్వం క్రీస్తు ఒక్కడే దేవునికీ నరులకూ మధ్యవర్తి అనేదానికి ఛాయగా నియమించబడింది. మోషే కేవలం ఛాయగా ఉన్న అతిపరిశుద్ధస్థలంలోకి ప్రవేశించి కేరూబుల మధ్యనుండి దేవుడు మాట్లాడితే విన్నాడు, మాట్లాడాడు. క్రీస్తు ఐతే నిజమైన పరలోకంలోనికి తన రక్తం ద్వారా ప్రవేశించి మన తరపున దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
సంఖ్యాకాండము అధ్యాయం 7

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"