సంఖ్యాకాండము 3:1 యెహోవా సీనాయి కొండమీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.
గత అధ్యాయాల్లో ఇశ్రాయేలీయుల కాల్బలం గురించి రాయబడితే ఈ అధ్యాయంలో లేవీ గోత్రం గురించి రాయబడడం మనం చూస్తాం. ఆ గోత్రంలో నాయకుడిగా మోషే మరియు ప్రధానయాజకుడిగా అహరోను ప్రముఖులు కాబట్టి ప్రారంభంలో వారి వంశావళి ప్రస్తావించబడింది.
సంఖ్యాకాండము 3:2-4 అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే. ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతా మారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.
ఈ వచనాలలో అహరోను కుమారుల గురించి రాయబడడం మనం చూస్తాం. వారిలో ప్రధమ కుమారులైన నాదాబు అబీహులు యెహోవా సన్నిధిలోకి అన్యాగ్నిని తీసుకెళ్ళినందున చనిపోయారు (లేవీకాండము 10:1,2). కాబట్టి తదుపరి కుమారులైన ఎలియాజరు ఈతామారులు యాజకులుగా సేవ చేసారు. అయితే ఇక్కడ మోషే కుమారుల గురించి మనమేమీ చూడము. ఎందుకంటే అహరోను యాజకత్వం వంశపారంపర్యమైనది కాబట్టి అతని కుమారుల పేర్లు ప్రస్తావించబడ్డాయి కానీ మోషే నాయకత్వం వంశపారంపర్యమైనది కాదు. అందుకే వారు విడిచిపెట్టబడ్డారు.
సంఖ్యాకాండము 3:5,6 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు లేవి గోత్రికులను తీసికొనివచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము.
ఈ వచనాలలో దేవుడు లేవీగోత్రికులను తీసుకువచ్చి అహరోను ముందు నిలవబెట్టమని మోషేకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ గోత్రం ప్రత్యక్షగుడారపు పరిచర్యకై నిర్ణయించబడింది కాబట్టి ప్రధానయాజకుడైన అహరోను ముందు వారిని నిలువబెట్టాలి. అయితే వీరు యాజకులు కాదు, యాజకత్వం అహరోను వంశీకులకు మాత్రమే. మిగిలిన లేవీయులంతా కేవలం ప్రత్యక్షగుడారాన్ని కాపాడడానికి దాని వస్తువులను మొయ్యడానికి మాత్రమే నియమించబడ్డారు. క్రింది వచనాలలో అదే గమనిస్తాం.
సంఖ్యాకాండము 3:7-9 వారు ప్రత్యక్షపు గుడా రము నెదుట మందిరపు సేవచేయవలెను. తాము కాపాడవలసినదానిని, సర్వసమాజము కాపాడ వలసినదానిని, వారు కాపాడవలెను. మందిరపు సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీ యులు కాపాడవలసిన దంతటిని, వారే కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలోనుండి అతని వశము చేయబడినవారు.
ఈ వచనాలలో లేవీయులకు నిర్ణయించబడిన విధిని మనం చూస్తాం. ముందటి వచనాలలో వివరించినట్టు వారు అహరోను మరియు అతని కుమారుల నాయకత్వంలో ప్రత్యక్షగుడారాన్ని కాపాడాలి, దాని ఉపకరణాలను అరణ్యంలో ఒకచోట నుండి మరోచోటికి మొయ్యాలి. గమనించండి; లేవీయులు అందరూ దేవుని ప్రత్యక్షగుడారపు సేవకోసం నిర్ణయించబడ్డారు, కానీ ప్రాముఖ్యమైన యాజకత్వం మాత్రం అందులో అహరోను వంశానిదే. అలాగే సంఘంలో కూడా అందరూ పరిచారకులే అయినప్పటికీ ప్రాముఖ్యమైన స్థానంలో దేవుని నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే కొనసాగాలి. వారికి అనుగ్రహించబడిన తలాంతులు, వాక్యం సూచిస్తున్న ప్రవర్తనను బట్టి వారిని గుర్తించాలి.
సంఖ్యాకాండము 3:10 నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.
ఈ వచనంలో యాజకత్వం అహరోను వంశానికే అప్పగించబడినట్టు మనం చూస్తాం. అందుకే మిగిలిన లేవీయులు సైతం యాజకత్వం విషయంలో అన్యులుగానే పరిగణించబడ్డారు. యాజకులు చేసే పనికి వారు పూనుకుంటే మరణశిక్ష విధించాలి. ఎందుకంటే అది దేవుని నిర్ణయం/నియమం పై తిరుగుబాటు చెయ్యడమే. పరిచర్య విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది, ఆ తలాంతు, దానికి తగిన పరిశుద్ధ జీవితం లేనివారు పరిచర్యకు పూనుకుంటే దేవుని నియమంపై తిరుగుబాటు చేసినవారిగా శిక్షించబడతారు.
సంఖ్యాకాండము 3:11-13 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నావశము చేసికొని యున్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు. ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను.
ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రతీ తొలిచూలుకు బదులుగా లేవీగోత్రాన్ని తన వశం చేసుకున్నట్టు ప్రకటించడం మనం చూస్తాం. ఆయన ఐగుప్తీయుల తొలిచూలులను వధించి పస్కా పశువు రక్తాన్ని బట్టి ఇశ్రాయేలీయుల తొలిచూలులను విడిచిపెట్టినదానికి జ్ఞాపకంగా ఇశ్రాయేలీయుల్లో ప్రతీతొలిచూలునూ ఆయనకు ప్రతిష్టించాలని ఆజ్ఞాపించాడు (నిర్గమకాండము 13:2). అయితే ఇశ్రాయేలీయుల్లో ప్రతీతొలిచూలూ ఆయన సేవకు ప్రతిష్టించబడడం సాధ్యం కాదు కాబట్టి వారిని ప్రత్యామ్నాయం ద్వారా విడిపింపచేసి వారికి బదులుగా లేవీయులందరినీ ఆయన సేవకోసం ప్రతిష్టించుకున్నాడు.
సంఖ్యాకాండము 3:14-16 మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. లేవీయుల పితరుల కుటుంబ ములను వారివారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింప వలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను.
ఈ వచనాల్లో దేవుడు లేవీయుల్లో ఒక నెలనుండి పై వయస్సు కలిగిన మగవారందర్నీ లెక్కించాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ముందటి వచనాల ప్రకారం; ఇశ్రాయేలీయుల తొలిచూలులకు బదులుగా ఈ లేవీయులు నియమించబడ్డారు కాబట్టి వారి తొలిచూలుల సంఖ్యతో వీరి సంఖ్యను పోల్చడానికే ఈ లెక్కింపు జరుగుతుంది. ఇక మగవారినే ఎందుకు లెక్కించాలంటే ప్రత్యక్షగుడారపు సేవ చేసేది వారే కాబట్టి మరియు ఐగుప్తీయుల తొలిచూలుల్లో వధించబడిందీ దానికి జ్ఞాపకంగా ఇశ్రాయేలీయుల తొలిచూలుల్లో ప్రతిష్టించబడేదీ మగవారే కాబట్టి వారిని మాత్రమే లెక్కించాలి.
అదేవిధంగా ఈ లేవీగోత్రపు లెక్కింపు దేవునిసేవ కోసం కాబట్టి పుట్టిన ప్రతీవాడూ దేవుని సేవకే అంకితం అనే భావనలో నెల నుండే లెక్కించబడ్డారు.
సంఖ్యాకాండము 3:17-26 లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి. మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీ యులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే. వారిలో లెక్కింప బడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందల మంది. గెర్షోనీ యుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు. ప్రత్య క్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకారయవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును.
ఈ వచనాల్లో లేవీ కుమారులైన గెర్షోను, కహాతు, మెరారీ వంశాల్లో గెర్షోను వంశంలో లెక్కించబడినవారిని మనం చూస్తాం. వారు 7500 మంది. వీరు ప్రత్యక్షగుడారానికి పడమటివైపున నివసిస్తూ గుడారాన్నీ దాని పైకప్పునూ గుడారపు ద్వారానికి ఉన్న తెరనూ ఆవరణ అడ్డతెరలూ ప్రత్యక్షగుడారానికీ బలిపీఠానికీ చుట్టూరా ఉన్న ఆవరణద్వారం తెరనూ దాని త్రాళ్ళనూ కాపాడాలి. అంటే ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించాలి, అలాగే అరణ్యంలో ఒకచోటినుండి మరోచోటికి ప్రయాణం అయినప్పుడు వాటిని వీరే మొయ్యాలి.
అయితే నెలప్రాయం మొదలుకొని లెక్కించబడిన గెర్షోనీయుల ఈ సంఖ్యలో చిన్నవారు ఆ పనులు ఎలా చెయ్యగలరనే సందేహం కలిగితే; లెక్కింపు మాత్రమే నెలప్రాయం మొదలుకొని జరిగింది కానీ పని చేసేవారంతా 30 యేళ్ళ వయస్సు నుండి ఉన్నవారే చెయ్యాలి. ఆ విషయం తర్వాత అధ్యాయంలో రాయబడింది. కహాతు వంశీకులకూ మొరారీ వంశీకులకు కూడా ఇదే నియమం. 30 యేళ్ళ వయస్సు నుండి ఉన్నవారు మాత్రమే ప్రత్యక్షగుడారపు సేవ చేస్తారు.
అదేవిధంగా గత అధ్యాయంలో ఇశ్రాయేలీయుల మిగిలిన గోత్రాలు ప్రత్యక్షగుడారం చుట్టూ ఆయా దిక్కుల్లో నివసించాలని చూసాం. ఉదాహరణకు; తూర్పున యూదా మరియు మరో రెండు గోత్రాలు. వారు అలా దిక్కుల చొప్పున నివసించవలసింది ఈ లేవీయుల చుట్టే. మొదటిగా ప్రత్యక్షగుడారం ఉంటుంది, దాని చుట్టూ లేవీయులు ఉంటారు, వారి చుట్టూ మిగిలిన గోత్రాలు ఉండాలి. అలా లేవీయులు ప్రత్యక్షగుడారం చుట్టూ ఉండవలసిన దిక్కుల్లో ఈ గెర్షోను వంశీకులకు పడమటి దిక్కు నిర్ణయించబడింది. అంటే అరణ్యంలో కూడా దేవుడు తన పిల్లలను ఒక క్రమం చొప్పున నివసింపచేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మనం కూడా అరణ్యం వంటి శోధన ఎదురైనప్పటికీ ఆయన వాక్య క్రమంలోనే నివసించాలి, నడుచుకోవాలి.
సంఖ్యాకాండము 3:27-31 కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి. కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబ మునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డ తెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు.
ఈ వచనాలలో లేవీ రెండవ కుమారుడైన కహాతు వంశంలో లెక్కించబడినవారి గురించి మనం చూస్తాం. వీరు 8600 మంది. వీరికి ప్రత్యక్షగుడారంలో అతిప్రాముఖ్యమైన మందసాన్ని బల్లనూ దీపవృక్షాన్నీ పరిశుద్ధస్థలంలో మిగిలిన ఉపకరణాలు మరియు అడ్డతెరను కాపాడే బాధ్యత అప్పగించబడింది. అలానే వీరు ప్రత్యక్షగుడారానికి దక్షిణపు దిక్కుగా దిగాలి.
గమనిక: ఈ కహతీయులకు మందసాన్ని బల్లనూ దీపవృక్షాన్నీ పరిశుద్ధస్థలంలో మిగిలిన ఉపకరణాలు మరియు అడ్డతెరను కాపాడే బాధ్యత అప్పగించబడినప్పటికీ వీరు నేరుగా వాటిని తాకకూడదు. అహరోను కుమారులైన యాజకులు వాటిని బట్టతో కప్పిన తర్వాతనే వీరు వాటిని అరణ్యంలో మరోచోటికి మొయ్యాలి. ఆ విషయం తర్వాత అధ్యాయంలో రాయబడింది.
మరోవిషయం; మోషే, అహరోనులు కూడా కహాతు కుమారుడైన అమ్రాము కుమారులే. అయితే అమ్రాము వంశంలో అహరోనూ అతని కుమారులు మాత్రమే యాజకులు. మిగిలిన మోషే కుమారులతో సహా అందరూ క్రింది వచనం ప్రకారం అహరోను కుమారుడైన ఎలియాజరు పర్యవేక్షణలో తమకు అప్పగించబడిన పని చెయ్యాలి. ఒకే వంశంలో ఒకే తండ్రికి పుట్టిన వారిలో కూడా ఇక్కడ దేవుని వేరు వేరు నిర్ణయాలను మనం చూస్తున్నాం.
సంఖ్యాకాండము 3:32 యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త.
ఈ వచనంలో అహరోను కుమారుడైన ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడిగా పరిశుద్ధ స్థలాన్ని కాపాడే అందరిపైనా విచారణ కర్తగా ఉన్నట్టు మనం చూస్తాం. అంటే అతను మిగిలిన లేవీయులంతా దేవుడు నియమించిన దిక్కుల్లోనే నివసిస్తున్నారా ప్రత్యక్షగుడారపు వస్తువులను కాపాడుతున్నాడా అనేది పర్యవేక్షించాలి. ఇది చాలా గొప్ప బాధ్యత.
సంఖ్యాకాండము 3:33-37 మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడినవారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందల మంది. మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు. మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణము లన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.
ఈ వచనాలలో లేవీ మూడవ కుమారుడైన మొరారీ వంశంలో లెక్కించబడినవారి సంఖ్యను మనం చూస్తాం. వీరు 6200 మంది. వీరు ప్రత్యక్షగుడారానికి ఉత్తరదిక్కున నివసిస్తూ 30 యేళ్ళ వయస్సు నుండి ఉన్నవారంతా మందిరం యొక్క పలకలనూ దాని అడ్డకర్రలనూ స్థంబాలనూ దిమ్మలనూ ప్రాకార స్థంబాలనూ వాటి దిమ్మలనూ మేకులనూ త్రాళ్ళనూ కాపాడాలి. అయితే గెర్షోనీయులు, కహతీయుల కంటే వీరికి భారమైన బాధ్యత నిర్ణయించబడింది. ఎందుకంటే అరణ్యంలో వీరు మొయ్యవలసిన స్థంబాలు దిమ్మలు పలకలు చాలా బరువుగా ఉంటాయి. అయితేనేం మందిరానికి అవే ఆధారంగా కూడా ఉంటాయి. అంటే దేవుడు వీరికి నిర్ణయించిన బాధ్యత భారమైనదే ఐనా అది మందిరానికి ప్రాముఖ్యమైనది కూడా. మనకు కూడా ఆయన పరిచర్యలో భారమైన బాధ్యతలు అప్పగించినప్పుడు అవి సంఘానికి ప్రాముఖ్యమైనవని గ్రహించి ఈ మొరారీయుల్లానే పాటుపడాలి.
సంఖ్యాకాండము 3:38 మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.
ఈ వచనంలో దేవుడు ప్రత్యక్షగుడారానికి తూర్పుదిక్కున మోషే అహరోను మరియు అతని కుమారులు నివసిస్తూ పరిశుద్ధస్థలాన్ని పర్యవేక్షించాలని ఆజ్ఞాపించడం చూస్తాం. అంటే మిగిలిన లేవీయులు దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే ప్రత్యక్షగుడారాన్ని కాపాడుతున్నారా ఆయా దిక్కుల్లో నివసిస్తున్నారా అనేది వీరే చూసుకోవాలి. అదేవిధంగా నాయకుడైన మోషే ఇక్కడ ప్రధాన తూర్పు దిక్కులో నిర్ణయించబడ్డాడు. కానీ అతని కుమారులు (అమ్రామీయులు) దక్షిణపు దిక్కునే నిర్ణయించబడ్డారు. మోషే నాయకత్వం వారసత్వంగా సంక్రమించేది కాదని ఇక్కడ మరోసారి తెలియచెయ్యబడింది.
సంఖ్యాకాండము 3:39 మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి, తమ తమ వంశ ములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది.
ఈ వచనంలో లేవీగోత్రంలోని నెలమొదలుకొని పై ప్రాయం కలిగినవారి సంఖ్యను మనం చూస్తాం. వీరు 22000 మంది. వీరందరూ ఇశ్రాయేలీయుల తొలిచూలులకు బదులుగా దేవుడు తనకోసం ప్రతిష్టించుకున్నవారు. అయితే గెర్షోనీయులు 7500 మంది, కహాతీయులు 8600 మంది, మెరారీయులు 6200 మంది, మొత్తం 22300 మంది ఔతున్నారు. కానీ పై వచనంలో 22000 మంది అని మాత్రమే అని రాయబడింది. కొందరు దీనిని వైరుధ్యంగా ఆరోపిస్తుంటారు కానీ ఈ అధ్యాయంలో 11,12 వచనాలు పరిశీలించినా 41, 45 వచనాలు పరిశీలించినా లేవీయుల మగపిల్లల్లో నెలప్రాయం మొదలుకొని జరిగిన ఈ లెక్కింపు ఇశ్రాయేలీయుల తొలిచూలులకు బదులుగా ఆయనకు ప్రతిష్ట చేసుకోవడానికని అర్థమౌతుంది. అయితే లేవీయుల్లో కూడా ప్రతీతొలిచూలూ దేవునిదే (నిర్గమకాండము 13:2). అలాంటప్పుడు లేవీయుల్లో ఆ 300 మందీ తొలిచూలు పిల్లలు అయ్యుంటే వారు అప్పటికే దేవునికి ప్రతిష్టించబడినవారు కాబట్టి వారు విడిపించబడకుండా (నిర్గమకాండము 13:13, 34:20) ఇశ్రాయేలీయుల మిగిలిన తొలిచూలులకు బదులుగా వారిని ప్రతిష్టించడం జరగదు. అందుకే ఈ వచనంలో ఆ 300 మందినీ మినహాయించి చెప్పబడింది.
సంఖ్యాకాండము 3:40 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలు కొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతిమగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము.
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల్లో నెలమొదలుకొని పైప్రాయం కలిగిన తొలిచూలులను లెక్కించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. లేవీయుల్లో ఐతే నెలప్రాయం మొదలుకొని పురుషులందరూ లెక్కించబడ్డారు, ఇశ్రాయేలీయుల్లో ఐతే తొలిచూలులే లెక్కించబడుతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల తొలిచూలులకు బదులుగా ఆయన లేవీయులను ప్రతిష్టించుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలీయుల తొలుచూలులే లెక్కించబడాలి. ఆ విషయం క్రింది వచనంలో స్పష్టంగా రాయబడింది.
సంఖ్యాకాండము 3:41 నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగ పిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలియైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసి కొనవలెను.
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల తొలిచూలు పిల్లలకు ప్రతిగా లేవీయులను, తొలిచూలు పశువులకు మారుగా లేవీయుల పశువులను తీసుకోవాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీన్నిబట్టి ఇశ్రాయేలీయుల తొలిచూలు పిల్లలకు బదులుగా లేవీయులు ప్రతిష్టించబడి ప్రత్యక్షగుడార సేవ చెయ్యాలి, వారి పశువులు దేవుని బలులకోసం వినియోగించబడాలి. ఇక్కడ లేవీయులు దేవునికి చెందినవారిగా ఘనపరచబడుతున్నారు, అదేవిధంగా తమ పశువులను దేవునికి ఇవ్వవలసినవారైయున్నారు. ఈ నియమాన్ని బట్టి దేవుని నుండి ఘనతను పొందుకునే క్రమంలో మనకు స్వంతమైన వాటిని ఆయనకు ఇవ్వవలసి ఉంటుందని నేర్చుకుంటున్నాం.
సంఖ్యాకాండము 3:42,43 కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారినందరిని లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండు వేల రెండువందల డెబ్బదిమూడు.
ఈ వచనంలో ఇశ్రాయేలీయుల తొలిచూలుల సంఖ్యను మనం చూస్తాం. వారు 22273 మంది. అంటే లెక్కించబడిన లేవీయులంటే 273 మంది ఎక్కువగా ఉన్నారు. దానికి ఏం చెయ్యాలో క్రింది వచనాలలో రాయబడింది.
సంఖ్యాకాండము 3:44-51 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను. నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీ యులు నా వారైయుందురు; నేనే యెహోవాను. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను. తులము ఇరువది చిన్న ములు. వారిలో ఎక్కువ మంది విమోచనకొరకు ఇయ్య బడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీయులవలన విడిపింప బడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను. పరిశుద్ధమైన తులముచొప్పున వెయ్యి మూడువందల అరువదియైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులయొద్ద తీసికొనెను. యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను.
ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల్లో లేవీయులంటే 273 మంది ఎక్కువగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల తొలిచూలులకు దేవుడు ఐదేసి తులాల వెండి చొప్పున నిర్ణయించడం మనం చూస్తాం. ఎందుకంటే ఒకరికి ఒకరు మాత్రమే బదులు గా ప్రతిష్టించబడగలరు. అంటే ఇశ్రాయేలీయుల తొలిచూలులందరికీ బదులుగా లేవీయులు ప్రతిష్టించబడడం సాధ్యపడలేదు. అందుకే దేవుడు దానికి ప్రత్యామ్నాయంగా శేషించిన 273 మందికీ ఐదేసి తులాల వెండి విమోచనధనంగా నిర్ణయించాడు. కానీ క్రీస్తు మాత్రమే దేవుని నిర్ణయంలో ఉన్న అందరి పాపాలకూ విమోచనధనం అయ్యాడు (మత్తయి 20:28). ఆవిధంగా ధర్మశాస్త్రంలోని ఈ నియమాలన్నీ మనుష్యులను క్రీస్తు వైపుకే నడిపిస్తున్నాయి.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
సంఖ్యాకాండము అధ్యాయం 3

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"